OTP స్కామ్ తో జర జాగ్రత్త గురూ...! అజాగ్రత్తగా ఉన్నారో మీ సొమ్ముకి రెక్కలొచ్చేస్తాయ్ !

మోసం మోసం .! ఇప్పుడు జనాలు తరుచు ఏదో ఒక మోసాలకు గురవుతూనే ఉన్నారు.

 Beware Of Otp Scam-TeluguStop.com

అంతే కాదు మోసపోయేవారు ఉంటే మోసం చేసేవారికి కొదవే లేదు.ఇంటర్నెట్ ప్రపంచం విస్తారించాక … కేటుగాళ్లు ప్రజల సొమ్ము చాలా సులువుగా కొట్టేస్తున్నారు.

అంతే కాదు… ఈ మధ్యన ఆన్‌లైన్ బ్యాకింగ్ మోసాలు కూడా… రోజురోజుకు పెరిగిపోతున్నాయి.మోసం చేయడం లో కూడా కేటుగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో మోసాలకు పాల్పడుతోనే ఉన్నారు.

అన్నిరకాల మోసాలు అయిపోయినట్టు ఇప్పుడు వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను సైతం హ్యాకర్లు వదిలిపెట్టడంలేదు.టు-ఫాక్టర్ అథంటికేషన్‌ను కలిగి ఉండే వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను అంత సులువుగా హ్యాక్ చేయటం కుదరని పని.అలాంటిది, వీటిని కూడా హ్యాకర్లు రాబట్టేస్తున్నారు.ముఖ్యంగా ఈ తరహా స్కామ్‌కు బెంగుళూరు వాసులు ఎక్కువగా బలైపోతున్నారు.

ఈ వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు చాలా స్మార్ట్‌గా దొంగిలించేస్తున్నారు.బాధితుల ఫోన్‌లలో మాల్వేర్‌లను ఇన్‌స్టాల్ చేయటం లేదా బ్యాంక్ ఉద్యోగులుగా పరిచయం చేసుకుని వారి వద్ద నుంచి ఓటీపీలను కొల్లగొట్టేస్తున్నారు.ఈ తతంగం మొత్తం ఎలా జరుగుతుందంటే?

ముందుగా… బాధితుడికి ఓ వ్యక్తి ఫోన్ చేసి, తాను బ్యాంక్ ఉద్యోగినని నమ్మించే ప్రయత్నం చేస్తాడు.ఆ తరువాత బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నామంటూ చెబుతారు.ఈ ప్రాసెస్‌లో భాగంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్, సీవీవీ, ఎక్స్‌పైరీ తేదీలను అడుగుతారు.ఇవి తెలుసుకున్న తరువాత ఆయా కార్డులతో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓ ఎస్ఎంఎస్‌ను పంపుతున్నామని, ఆ ఎస్ఎంఎస్‌లో కన్ఫర్మేషన్ లింక్ ఒకటి ఉంటుందని, ఆ లింక్ పై క్లిక్ చేసినవెంటనే అప్ గ్రేడ్ ప్రాసెస్ పూర్తవుతుందని వారు చెబుతారు.

ఆ మాటలను నమ్మి ఎస్ఎంఎస్‌ను ఓపెన్ లోపలి కన్ఫర్మేషన్ ముసుగులో ఉన్న మాల్వేర్ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే యూజర్ ఫోన్ లో తనకు తెలియకుండానే మాల్వేర్‌ ఇన్‌స్టాల్ అయి పోతుంది.ఆ తరువాత నుంచి యూజర్ ఫోన్‌కు వచ్చే ప్రతి మెసేజ్ కూడా హ్యాకర్‌కు రీడైరెక్ట్ అవుతుంది.ఈ విధమైన వ్యూహాలను అనుసరించి బ్యాంక్ ఖాతాల నుంచి యూజర్లు డబ్బు దొంగిలించేస్తున్నారు.ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తెలివిగా వ్యవహరించకపోతే కష్టబడి కూడబెట్టుకున్న సొమ్ము కాస్తా ఇలా పరులపాలు కావాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube