ఏపీలో కేసీఆర్ పెత్తనం ... ఆయన గెలిస్తే ఇదే జరుగుతుందా...?

తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే ఆ కూటమిలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ… ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెత్తనం చేస్తాడని… మీకు తెలంగాణ వారు కావాలా… లేక ఆంధ్ర వారి పెత్తనం కావాలా.అంటూ టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టింది.

 Kcr Return Gift Effect On Ys Jagan-TeluguStop.com

దీంతో తెలంగాణ ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఆలోచన రేకెత్తింది.నిజమే కూటమి అధికారంలోకి వస్తే ఇదే జరుగుతుందేమో అన్న సందేహం కూడా ఏర్పడింది.

దీంతో ఆ ఎఫెక్ట్ ప్రజా కూటమి ఓటమికి కారణం కూడా అయింది.అయితే ఓటమికి అయితే జరిగింది ఏపీలో వైసీపీ పార్టీ కి కూడా అదే జరుగుతుందేమో అన్న సందేహం ఇప్పుడు ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది.

ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ తో వైసిపి సఖ్యత గా ఉండడం, జగన్ గెలుపు కోసం ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించడం జరిగిపోయాయి.ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి లాభపడాలని టిడిపి భావిస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో …కాంగ్రెస్‌ను గెలిపించాలనే పట్టుదలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రదర్శించారు.కానీ అక్కడ టీఆర్ఎస్ గెలిచింది.అయితే ఆ తరువాత కేసీఆర్ లో చంద్రబాబు మీద కసి బాగా పెరిగిపోయింది.తాము అధికారంలోకి రాకుండా… బాబు సర్వశక్తులు ఉపయోగించారనే… కోపంతో ఏపీలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు.సాధారణంగానే… కేసీఆర్ నుంచి ఇలాంటి ప్రకటన వచ్చిన తర్వాత ఏపీలో కలకలం రేగింది.కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా ఏపీలో పరిస్థితి ఉంటుందని అంతా అనుకున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు ఏపీ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే.ఆ రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబుకు.

గొప్పగా ఉంటుందన్న ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై విమర్శలు చేసిన ప్రతీ సారి టీడీపీ అంతకు మించి విమర్శలు గుప్పించింది.చంద్రబాబుకు కేసీఆర్ ఇవ్వాలనుకున్న ఆ గిఫ్ట్ వీలైనంత వరకూ లోపాయికారీగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ పై పడింది.కానీ లోపాయికారీగా ఉంచాల్సిన అవసరం టీఆర్ఎస్ కు లేదు.

ఇంకా చెప్పాలంటే.టీఆర్ఎస్ కు చాలా అవసరం.

తమ వెనుక వైసీపీ లాంటి పార్టీలు ఉన్నాయని చెప్పుకుంటేనే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు గౌరవం లభిస్తుంది.అందుకే వైసీపీ నేతలతో కేసీఆర్ బహిరంగ చర్చలు, సమావేశాలకు పార్టీ నేతల్ని పంపిస్తున్నారు.

ఇదందా.కేసీఆర్ కు మేలు చేస్తుంది.

కానీ ఇది ఏపీలో వైసీపీ కి ఖచ్చితంగా చేటు తెస్తుంది.ఈ విషయం జగన్ కు తెలుసు.

కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో అంతకు మించి మరో ఆప్షన్ జగన్ కు కనిపించడంలేదు.

ఈ విధంగానే జగన్ కేసీఆర్ ట్రాప్ లో పడిపోయాడు.ఈ విషయాన్ని టీడీపీ కూడా రాజకీయంగా బాగా ఉపయోగించుకుంటోంది.ఇప్పటికే… వైసీపీని ఆంధ్రా టీఆర్ఎస్ అని ప్రచారం చేస్తోంది.దీన్ని గట్టిగా తిప్పికొట్టుకోవాల్సి ఉన్నా జగన్ మాత్రం ఆ అంశాన్ని పట్టించుకోవడంలేదు.జగన్ గెలిస్తే.కేసీఆర్ ఏపీపై పెత్తనం చేస్తాడన్న ఒక్క భావన వస్తే.ప్రజలు స్పందించే తీరు అనూహ్యంగా ఉంటుంది.

కానీ ఇక్కడ జగన్ ఓడిపోతే టీఆర్ఎస్ కు వచ్చే నష్టమేం లేదు.కానీ జగన్ ఓడిపోతే.

ఆయన రాజకీయ భవిష్యత్ కే కాదు.వ్యక్తిగతంగా కూడా.

ఇబ్బందులు ఏర్పడతాయి.ఈ విషయంలో జగన్ రాజకీయ అడుగులు చాలా జాగ్రత్తగా వెయ్యకపోతే వైసీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ విషయంలో జగన్ ఇంకేరకమైన స్టెప్ తీసుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube