గోడ చర్చలు విఫలం..ట్రంప్ బై బై...

అమెరికాలో మెక్సికో సరిహద్దుల్లో గోడ వ్యవహారం అమెరికా మొత్తాని కుదిపేస్తోంది.గోడ కట్టాల్సిందే నని ట్రంప్ , అంత ఖర్చు ఎందుకు వద్దూ అంటూ డెమోక్రాట్లు.

 Wall Meetings Failed And Trump Says Bye-TeluguStop.com

ఇలా ఇరు వర్గాలు గత కొంతకాలంగా వాదోప వాదాలు చేసుకుంటున్నారు.ఇదే అంశంపై తాజాగా చర్చలకి కూర్చున్న ఇరు వర్గాల చర్చలు ఫలించక పోవడంతో ట్రంప్ చర్చల మధ్యలోనే ఆవేశంగా నిష్క్రమించారు.

5.7 బిలియన్ డాలర్ల ఒక గోడ కోసం ఖర్చు పెట్టడం అస్సలు కుదరదని డెమోక్రాట్లు తెగేసి చెప్పడంతో ఒక్క సారిగా ట్రంప్ బల్లపై గట్టిగా చరుస్తూ ట్రంప్ సమావేశం నుంచి వెళ్లిపోవడంపై స్పీకర్ నాన్సీ పెలోసీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.గోడ నిర్మాణంతో ఎన్నో రకాల లాభాలు అమెరికా ప్రజలకి ఉన్నాయని ఎంతగా చెప్పినా డెమోక్రాట్లు తనకి సహకరిచడం లేదని ట్రంప్ గుర్రుగా ఉన్నారు.

అయితే ఇరువురి గొడవల కారణంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన గత నెల 22వ తేదీ నుంచి నడుస్తూనే ఉంది.1995-96 లో ఉద్యోగులు దాదాపు 21 రోజులు విధులకు హాజరు కాలేదు.అయితే ఇప్పటికి ఈ గొడవలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అంటూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube