కాపుల ఓట్లు ఎవరికి..ఆసక్తిరేపుతున్న...???

ఏపీలో ఆసక్తి రేపుతున్న ఏకైక అంశం కాపుల ఓట్లు ఎవరికి పడనున్నాయి.?? ఏపార్టీకి కాపులు పట్టం కట్టనున్నారు…?? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది ప్రస్తుత రాజకీయ పరిస్తితులల్లో.ఏ పార్టీకి పార్టీ కి తగ్గట్టుగా కుల సమీకరణాలు ఉన్నాయి.తెలుగు దేశానికి కమ్మ సామాజిక వర్గం కాపు కాస్తుందని, వైసీపీకి రెండ్లు కాపు కాస్తారని.ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.మరి తమ సామాజిక వర్గం నుంచీ ఎదగాలాని, సీఎం స్థాయికి వెళ్లాలని ఆరాట పడుతున్న పవన్ కి కాపులు కాపు కాస్తారా.?? అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.

 Who Will Gets Kapu Vote Bank In Ap-TeluguStop.com

అయితే ఏపీలో రాజకీయ నేతలు కాపుల విషయంలో ఎలాంటి ఆలోచనతో ఉన్నారో అందరికి తెలిసిందే.బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చివరికి చేతులు ఎత్తేసిన పరిస్థితి టీడీపీ పార్టీది.మరో వైపు బీసీల్లో చేర్చడం ఎంత మాత్రం సాధ్యంకాదని బాబు అబద్దపు విషయాలు నమ్మకండి అంటూ నిజాన్ని నిర్భయంగా చెప్పి క్లారిటీ ఇచ్చింది వైసీపీ.

కులం కార్డు తో తప్పకుండా సక్సెస్ సాధిస్తామని ఎదురు చూస్తోంది జనసేన.మరి ఈ పరిస్థితుల్లో కాపులు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది సస్పెన్స్ గా మారింది.

గతంలో పవన్ టీడీపీ కి మద్దతు ఇచ్చాడు కాబట్టి కాపులు గుంత గప్పగా ఓట్లు గుద్దేశారు టీడీపీ కి .కాని రిజర్వేషన్ విషయంలో హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు బాబు ని కాపులు నమ్మే పనిలేదు సరికదా ఒక్క ఓటు కూడా తెలుగు దేశానికి వేయకూడదు అంటూ తమ తమ ఇళ్ళల్లో తీర్మానించుకుంటున్నారట.దాంతో ఈ సారి తెలుగు దేశానికి పడాల్సిన ఓట్లు మొత్తం జనసేనకి పడిపోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.ఇక పొతే

జగన్ కి ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్న కాపు వర్గాలు మాత్రం జనసేనకి మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడం లేదట , కేవలం తెలుగు దేశం పార్టీకి పడాల్సిన కాపు ఓట్లు మాత్రమే పవన్ కి పదనున్నాయని.వైసీపీ కాపు ఓటు బ్యాంక్ చెక్కు చెదరదని అంటున్నారు విశ్లేషకులు.ఇక పవన్ కులాలకి నేను అతీతుడిని అని చెప్పడం చూస్తుంటే ఏపీ ప్రజల చెవ్వుల్లో పువ్వులు ఉన్నాయా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు.

పై పైకి కుల రాజకీయాలకి మద్దతు ఇవ్వనూ అంటూనే లోలోపల చేసేది చేసేస్తున్నారు అనే టాక్ ప్రజలలోకి బాగా వెళ్ళిపోయింది.దాంతో కాపుల ఓట్ల మాట అలా ఉంచితే మిగిలిన వర్గాలు చాలా మటుకు పవన్ కి దూరం అవుతున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అయితే మొదట్లో పవన్ పై ఉన్న నమ్మకం ఇప్పుడు ఏపీ ప్రజలకి లేదని.పవన్ కి జగన్ కి కాపులు సమానమా మద్దతు ఇస్తారని తేల్చి చెప్పేస్తున్నారు రాజకీయ పండితులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube