పశ్చిమ టీడీపీలో సర్వే టెన్షన్ ! వీరికి టికెట్ డౌటే ...?

టీడీపీలో ఇప్పుడు సర్వేల టెన్షన్ మొదలయ్యింది.ఒకవైపు వైసీపీ అధినేత జగన్ మరో కొద్ది రోజుల్లో ముందస్తుగా….

 Chandrababu Naidu Gets Survey On Pachim Godavari-TeluguStop.com

టికెట్ల కేటాయింపు పై ప్రకటన చేస్తున్న నేపథ్యంలో….టీడీపీ కూడా పార్టీ అభ్యర్థులను ముందస్తుగా… ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏఏ జిల్లాల్లో పరిస్థితి ఏంటి…? గెలుపు గుర్రాలు ఎవరు అనే విషయాలపై టీడీపీ అన్తరగతంగా సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఒకవైపు జనసేన కూడా రాజకీయంగా బలపడడం… వైసీపీకి గతంలో కంటే… ఇప్పుడు ప్రజాధారణ పెరగడం… ఎన్నికలకు ఒంటరిగా… బరిలోకి దిగాల్సి రావడం ఇవన్నీ… టీడీపీ ని కలవరపెడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే… గెలుపు గుర్రాలకే టికెట్ల కేటాయింపు చేయాలనే ఆలోచనలో బాబు వివిధ కోణాల్లో సర్వేలు చేయిస్తున్నాడు.దీంతో పాటు ఇంటిలిజెన్స్ సర్వే… ఐవీఆర్ఎస్ …ఇలా అన్ని కోణాల్లో రిపోర్ట్స్ తెప్పించుకుంటూ … అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాడు బాబు.

అసలు ఇప్పటికే టీడీపీకి కంచుకోటలా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వే పూర్తయ్యిందని సమాచారం.ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం సిట్టింగ్ లలో దాదాపు ఏడు ఎనిమిది మందికి టికెట్ ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదట.

వారి స్థానంలో ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బలమైన నాయకుడిగా ముద్రపడ్డ వ్యక్తుల బయోడేటా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

అంతే కాకుండా… టికెట్ కోల్పుతున్న సీట్ట్టింగ్ ఎమ్యెల్యేలకు కూడా పరోక్షంగా ఈ సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా కాపు సామజిక ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో జనసేన దూకుడుగా ఉండి ప్రజల్లోకి దూసుకుపోతుండడంతో ఆయా నియోజకవర్గాలపై ప్రధాన దృష్టి పెట్టారట.పశ్చిమగోదారి లో పార్టీలు … సామజిక వర్గాల ప్రకారం చూసుకుంటే… జిల్లాలో వైసీపీ ప్రభావం ఏడు నుంచి పన్నెండు నియోజకవర్గాల్లో తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

అలాగే జనసేన దాదాపు రెండు నియోజకవర్గాల్లో బలంగా కనిపిస్తోంది.

జనసేన ప్రభావం తీవ్రంగా ఉండే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే….ఈ పరిధిలో ఉన్న నరసాపురం , పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, నియోజకవర్గాల్లో జనసేన చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ… జనాల్లోకి వెళ్ళిపోతోంది.ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గం పై పవన్ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టడంతో టీడీపీ కూడా ఈ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది.

ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్యెల్యే నిమ్మల రామానాయుడు మీద పార్టీ క్యాడర్ , ప్రజల్లోనూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు.

అలాగే ఏలూరు ఎంపీ, ఎమ్యెల్యే స్థానాల్లో కొత్త అభ్యర్థుల వేట మొదలుపెట్టారు.దీంతో పాటు కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో కూడా మార్పు తప్పదు అనే సంకేతాలు పార్టీ నుంచి వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube