డార్లింగ్‌ను పట్టిన దిల్‌రాజు... పూర్తి వివరాలు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోసం

డార్లింగ్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రం తర్వాత ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ అయ్యాడు.బాహుబలి చిత్రంతో వే కోట్ల వసూళ్లను ప్రభాస్‌ దక్కించుకున్నాడు.

 Dil Raju New Prestigious Project With Baahubali Prabhas-TeluguStop.com

ఆ కారణంగానే ప్రభాస్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడినది.ప్రస్తుతం ‘సాహో’ చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ప్రభాస్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ రెండు చిత్రాల తర్వాత మరో భారీ చిత్రాన్ని ప్రభాస్‌ చేసేందుకు కమిట్‌మెంట్‌ ఇచ్చినట్లుగా సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కన్నడ స్టార్‌ హీరో యష్‌ తో ‘కేజీఎఫ్‌’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్‌తో బాహుబలి స్థాయిలో సినిమాను తెరకెక్కించాడు అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.అందుకే ప్రశాంత్‌ నీల్‌తో ఒక సినిమాను నిర్మించేందుకు దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు.దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో దిల్‌రాజు సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడట.తాజాగా ప్రశాంత్‌ నీల్‌ మరియు ప్రభాస్‌లు భేటీ అయ్యారు.వీరిద్దరి భేటికి ప్రధాన కారణం సినిమానే అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రశాంత్‌ వద్ద ఉన్న స్టోరీ లైన్‌ను తాజాగా ప్రభాస్‌కు వినిపించినట్లుగా తెలుస్తోంది.

దిల్‌రాజుకు బాగా నచ్చిన ఆ స్టోరీ లైన్‌కు ప్రభాస్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, 2020వ సంవత్సరంలో సినిమాను ప్రారంభించి 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాడు.ప్రశాంత్‌ నీల్‌ మరో వైవిధ్యభరిత కథాంశంతో ప్రభాస్‌ హీరోగా 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ప్రభాస్‌కు ఉన్న మార్కెట్‌ దృష్ట్యా 200 కోట్లు పెద్ద విషయం ఏమీ కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube