కొత్త ఏడాదిలో ఈ పది తప్పకుండా చేయాలనుకుంటారు... కాని ఇందులో అయిదు కూడా చేయలేరు, మీరు ప్రయత్నిస్తున్నారా?

మరో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాం.పాత సంవత్సరంకు గుడ్‌ బై చెప్పి, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న సమయంలో ఎక్కువ శాతం మంది రెజల్యూషన్స్‌ అంటూ తీసుకుంటారు.

 Most Common New Years Resolutions You Dont Stick-TeluguStop.com

కొత్త సంవత్సరంలో తమ బ్యాడ్‌ అలవాట్లను వదిలేయాని గట్టిగా పట్టుబడుతారు.కొత్త సంవత్సరంలో ఆ బ్యాడ్‌ అలవాట్లకు గుడ్‌ బై చెప్పాలని దృడ నిశ్చయం చేస్తారు.

కాని వందలో 95 మంది కూడా నూతన సంవత్సరం రెజల్యూషన్స్‌ను వెంటనే మర్చి పోతారు.కొత్త సంవత్సరంలో అత్యధికులు తీసుకునే ముఖ్యమైన పది రెజల్యూషన్స్‌ ఏంటీ, ఎందుకు వాటిని పాటించరు అనేది ఇప్పుడు చూద్దాం.

కొత్త సంవత్సరంలో తాగకూడదని, తాగనంటూ ఎక్కువ శాతం రెజల్యూషన్‌ తీసుకుంటారు.
ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రతి రోజు వ్యాయామం చేయాలనుకుంటారు.
కొత్త సంవత్సరంలో డబ్బు వృదా చేయకుండా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ, వృదా ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటారు.
కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించేందుకు ప్రయత్నించాలని భావిస్తారు.
కొత్త సంవత్సరంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకునేందుకు బుక్స్‌ చదవాలనుకుంటారు.

కొత్త ఏడాదిలో ఫోన్‌ వాడకం తగ్గించాలనుకుంటారు.
ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలనుకుంటారు.
అర్థరాత్రి వరకు మేలుకువతో ఉండి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టకుండా త్వరగా పడుకోవాలనుకుంటారు.
కొత్త ఏడాదిలో ఉన్న అప్పులను ఎలాగైనా తీర్చేందుకు బడ్జెట్‌ ప్లాన్‌ చేసుకోవాలి.
గత ఏడాదిలో ఎక్కువగా టూర్లకు వెళ్లలేక పోయాం, ఈ ఏడాదైనా టూర్లకు వెళ్లి ఎంజాయ్‌ చేయాలనుకుంటారు.

ఈ పది రెజల్యూషన్స్‌ను మొదటి రెండు మూడు వారాలు లేదంటే మహా అయితే ఒకటి రెండు నెలలు పాటిస్తారు.అంతకు మించి ఎవరు పాటించరు.95 శాతం మంది కూడా తమ రెజల్యూషన్స్‌ను కేవలం మొదటి నెలలోనే వదిలేస్తారని ఒక సర్వేలో వెళ్లడయ్యింది.మరి ఈ ఏడాదిలో మీరు తీసుకున్న రెజల్యూషన్స్‌ ఏంటీ, వాటిని మీరు ఎంత గట్టిగా ఫాలో అవుతున్నారో కామెంట్స్‌ రూపంలో మాకు తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube