గల్లాకి..విజయం కల్లే..ఎందుకంటే..??

గల్లా ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి.రాజకీయాల్లో గల్లా ఫ్యామిలీ కి ఓ చరిత్ర ఉంది.

 Chandrababu Naidu Survey On Galla Jayadev Tdp1-TeluguStop.com

ఎన్నో ఏళ్లుగా రాజకీయాలని శాసించిన ఫ్యామిలీ వారిది.చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం అంటే గల్లా ఫ్యామిలీ కి పెట్టిన కోట.అయితే గతం ఎంతో ఘనమే కాని వర్తమానం, భవిష్యత్తు మాత్రం వారికి కలిసి రావడం లేదు.చరిత్రలు చెప్పుకోవడానికి మాత్రమే మిగిలి ఉన్నాయి తప్ప వారి రాజకీయ భవిష్యత్తుని ముందుకు నడిపించలేని విధంగా ఉన్నాయి.

గల్లా అరుణ దాదాపు చంద్రగిరి నుంచీ ఓడిన తరువాత ఇక ఆమె రాజకీయ భవిష్యత్తు పై సందేహాలు వ్యక్తం అయ్యాయి.కాని

తన కొడుకు గుంటూరు ఎంపీ అయిన గల్లా జయదేవ్ మాంచి ఫాం లో ఉన్నాడని సంతోషపడిన ఆ ఫ్యామిలీ కి ఆ కాస్త సంతోషం సైతం ఆవిరి అవుతోంది.

ప్రస్తుతం జయదేవ్ స్థానం నుంచీ ఎంతో మంది కాకలు తీరిన నేతలు పోటీ చేయడానికి పోటీలు పడుతున్నారు.ఈ నేపధ్యంలోనే చంద్రబాబు ఆ స్థానం నుంచీ గల్లా పై ఓ నివేదిక తెప్పించుకున్నారట.

ఆ నివేదికలో బాబు కి షాక్ ఇచ్చే అంశాలు చాలానే ఉన్నాయట.దాంతో బాబు ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ ఆ నివేదిక సారాంశం ఏమిటంటే.గల్లాపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారట.ముఖ్యంగా తమ సమస్యలు చెప్పుకుందాము అంటే ఆయన అందుబాటులో ఉండరనే వ్యాఖ్యలు చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయట.పని చేసినా చేయక పోయినా ప్రజలకి అందుబాటులో ఉంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కాని అసలు అందుబాటులో లేకపోతే ప్రజలు అడిగే ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేక పోతున్నాము అంటూ టీడీపీ నేతలే పెదవి విరుస్తున్నారట.

అంతేకాదు స్థానికంగా జరిగే నియోజకవర్గ అధికారిక సమావేశాలకు సైతం ఆయన హాజరు కావడం లేదని పార్టీ నేతలు కూడా చంద్రబాబు పలు మార్లు వివరించారు.

ఇదిలాఉంటే నియోజకవర్గ పరిధిలో జరిగే పనుల పర్యవేక్షనలో సైతం ఆయన అలసత్యం చేస్తున్నారని.

కనీసం అధికారులు, కాంట్రాక్టర్‌లతో ఒక్కసారి కూడా సమీక్షలు నిర్వహించిన సందర్భాలు లేవని టాక్ వాపోతున్నారట.ఆయన నిర్లక్ష్యం నియోజక వర్గ అభివృద్ధి కుంటుపడేలా చేసిందని.దాంతో ఆ ప్రభావం పార్టీపై పడుతోందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తునారట.స్థానిక పార్టీ నేతలని కలుపుకుని పోయే వ్యక్తిత్వం లేదని.తాను నమ్మిన వారిని తప్ప మిగిలిన పార్టీ నేతలని కనీసం పలకరించడం కూడా చేయడంలేదాని గతంలోనే గల్లా పై బాబు కి ఫిర్యాదులు అందాయని, కాని ఇప్పటికి గల్లా తీరు అదేవిధంగా ఉందనే రిపోర్ట్ సైతం బాబు వద్ద ఉందని అంటున్నారు…

దాంతో ఇప్పుడు గల్లా సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.,మోడీ ని మిస్టర్ మోడీ అన్నప్పుడు వచ్చిన హైప్ స్థానికంగా ఉన్న సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారం చూపక పోవడం వగైరా వగైరా కారణాలతో తుడిచి పెట్టుకు పోయిందని అంటున్నారు పరిశీలకులు.దాంతో స్థానికంగా ప్రజలకి మాత్రమే కాకుండా పార్టీ నేతల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం ఆవడంతో బాబు త్వరలోనే టిక్కెట్టు విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు గల్లాకి ఎదురవుతాయో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube