ఇద్దరు కార్మికులు ఓవర్‌ నైట్‌ లో కోటీశ్వరులు అయ్యారు.. 2018లో అత్యంత అదృష్టవంతులు వారిద్దరే

అదృష్టం ఎప్పుడు ఏ దిక్కు నుండి వస్తుందో ఎవరూ ఊహించలేరు.అదృష్టం కలిసి వస్తే బండ్లు ఓడలవుతాయి, అదృష్టం లేకుంటే ఓడలు బండ్లు అవుతాయనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు.

 Two Labourers Dug One Of The Biggest Diamonds From Pannas-TeluguStop.com

అదృష్టం కలిసి రావడంతో ఇద్దరు కూళీల జీవితంలో అద్బుతమైన మార్పు వచ్చింది.వారు ఊహించని విధంగా వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు.

తినడానికి తిండి కోసమే ఎంతో కష్టపడే వారు ఒక్కసారిగా కోట్ల రూపాయలను కళ్ల చూసే పరిస్థితి వచ్చింది.ఈ సంఘటన మద్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మోతీలాల్‌ మరియు రఘువీర్‌ లు పన్నాలోని ఒక పెద్ద గనిలో దినసరి కూలీలుగా పని చేసుకుని జీవితాన్ని గడుపుతున్నారు.ఆమద్య వీరికి పని చేస్తున్న సమయంలో ఒక కాంతి వంతమైన రాయి ఒకటి కనిపించింది.ఆ రాయిని డైమండ్‌ ఆఫీసర్‌ కు ఇద్దరు కూడా అప్పగించారు.ఆ డైమండ్‌ ఆఫీసర్‌ ఆ రాయిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అది అత్యంత ఖరీదైన రాయిగా నిర్థారించాడు.

ఆ రాయిని అమ్మితే లక్షల్లో డబ్బులు వస్తాయని వారు ఊహించారు.కాని వారు ఊహించని విధంగా ఆ రాయిని ఒక వజ్రాల వ్యాపారి వేలంలో ఏకంగా 2.55 కోట్లకు అమ్ముడు పోయింది.

42.9 క్యారెట్ల వజ్రంగా ఆ వ్యాపారి చెప్పుకొచ్చాడు.కేరట్‌ కు ఆరు లక్షల చొప్పున పెట్టి కొనుగోలు చేశాడు.

అంత భారీ రేటు పలకడంతో ఆ కూలీలు అవాక్కయ్యారు.వచ్చిన డబ్బులో 20 శాతం ప్రభుత్వంకు పన్ను రూపంలో చెల్లించి మిగిలిన డబ్బును ఇద్దరు చెరి సమానంగా పంచుకున్నారు.

తమకున్న అప్పులు తీర్చేసుకుని, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు ఈ డబ్బును ఖర్చు చేస్తామని చెప్పుకొచ్చారు.

మామూలుగా అయితే ఇలాంటి వజ్రాలు, బంగారం దొరికితే ప్రభుత్వాలు స్వాదీనం చేసుకుంటాయి.మరి మద్య ప్రదేశ్‌ ప్రభుత్వంలో అలాంటి పద్దతి లేదేమో అందుకే మోతీలాల్‌ మరియు రఘువీర్‌లు అదృష్టంతో దొరికిన వజ్రం వారి సొంతమే అయ్యింది.వారిద్దరికి అదృష్టం కలిసి వచ్చింది, కష్టపడి పని చేసే వారికి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube