‘పడి పడి లేచె మనసు’ బడ్జెట్‌, కలెక్షన్స్‌... నష్టం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

శర్వానంద్‌, సాయి పల్లవి జోడీగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పడి పడి లేచె మనసు’ చిత్రం నిరాశ పర్చింది.ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో పాటు, సాయి పల్లవికి మొదటి తెలుగు ఫ్లాప్‌గా నిలిచింది.

 Padi Padi Leche Manasu Budget And Collections-TeluguStop.com

మంచి కథలు ఎంపిక చేసుకుంటాడనే నమ్మకం అందరికి ఉన్న శర్వానంద్‌ ఈ చిత్రంను ఎలా ఎంపిక చేసుకున్నాడా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ చిత్రం వల్ల నిర్మాతలకు దాదాపుగా 20 కోట్ల వరకు నష్ట వచ్చినట్లుగా చెబుతున్నారు.

దర్శకుడు హను రాఘవపూడి బడ్జెట్‌ను కంట్రోల్‌ చేయడం తెలియదు అని నితిన్‌తో తెరకెక్కించిన ‘లై’ సినిమాతోనే తేలిపోయింది.ఆ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొంది, దారుణమైన పరాజయం పాలయ్యింది.తాజాగా ఈ చిత్రంను కూడా 15 కోట్లతో అనుకుని, 20 కోట్లకు బడ్జెట్‌ ను పెంచి, సినిమా ప్రొడక్షన్‌లో ఉన్న సమయంలో మరో పది కోట్లకు పెంచేశాడు.సినిమా రీ షూట్‌లు మరియు ఇతర కారణాల వల్ల బడ్జెట్‌ ఏకంగా 30 కోట్లకు టచ్‌ అయ్యింది.

అయితే దర్శకుడు హను రాఘవపూడిపై పెద్దగా నమ్మకం లేక పోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.డిస్ట్రిబ్యూటర్లు ధైర్యం చేయలేక పోయారు.దాంతో నిర్మాతలకు పెద్ద పడి పడ్డట్లయ్యింది.

కలెక్షన్స్‌ మరియు ఇతర రైట్స్‌ ద్వారా కనీసం 10 కోట్లయినా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

అంటే నిర్మాతలకు దాదాపుగా 20 కోట్ల వరకు నష్టాలు తప్పవని ట్రేడ్‌ వర్గాల వారు తేల్చి పారేస్తున్నారు.ఏమాత్రం ఆకట్టుకోని కథకు మరీ ఇంత బడ్జెట్‌ ఎందుకు అనే విషయాన్ని నిర్మాతలు అయినా గుర్తించలేదా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి పడి పడి లేచె మనసు చిత్రం ఏమాత్రం నిర్మాతలకు సంతృప్తిని, ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వలేక పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube