కేటీఆర్‌తో ముడి పడి ఉన్న రామ్‌చరణ్‌ సక్సెస్‌ సీక్రెట్‌.. వర్కౌట్‌ అయ్యేనా?

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు.

 Ktr Is The Person Behind Ram Charan Secret Of Success-TeluguStop.com

ఈ వేడుకకు యంగ్‌ అండ్‌ డైనమిక్‌ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు.కేటీఆర్‌ గతంలో కూడా రామ్‌ చరణ్‌ నటించిన ‘ధృవ’ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరయ్యాడు.

కాగా పరాజయాలతో ఉన్న చెర్రీకి మంచి సక్సెస్‌ వచ్చింది.దాంతో అదే సెంటిమెంట్‌తో ఈ సారి కూడా కేటీఆర్‌ను ఆహ్వానించినట్టున్నారు.

సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుంది అని కేటీఆర్‌ని ఆహ్వానించారా లేక అభిమానులందరి ముందు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెరాసకు శుభాకాంక్షలు తెపడానికి పిలిచారా? అని అటు అభిమాన వర్గాల్లో ఇటు తెరాస వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరిగాయి.ఏది ఏమయినా కూడా చిరంజీవి, రామ్‌ చరణ్‌ కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ మంత్రి అని చిరు కేటీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.ఇక కేటీఆర్‌ కూడా ఇదే తరహాలో చిరును పొగిడేశారు.తెలుగు పరిశ్రమలోనే కాదు భారతీయ సినీ పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగిన స్టార్‌ మెగాస్టార్‌ అంటూ కేటీఆర్‌ చిరును ప్రశంసించాడు.

ఇకపోతే చిరంజీవి గారు సముద్రమంతా అభిమానాన్ని, అద్బుతమైన వారసులను తెలుగు తెరకు పరిచయం చేశారు అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.సోదరుడు రామ్‌చరణ్‌ ఒకసారి గడ్డంతో కనిపించాడు.ఏ సినిమా చేస్తున్నావ్‌ అని అడగగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే చిత్రం అనగానే అర్బన్‌ కుర్రాడిగా నాకు చరణ్‌ తెలుసు, ఇక నేను చరణ్‌ను అలా చూడలేను అని, ఆ సినిమా చూడను అని డైరెక్ట్‌గా చెప్పేశా.

కానీ మంచి సినిమా.

సూపర్‌ హిట్‌ అయింది అని స్నేహితులు అనగానే ‘రంగస్థలం’ నేను చూశా.గతంలో ‘ధృవ’ చిత్ర ఫంక్షన్‌కు వచ్చా.అది పెద్ద హిట్టు, ఈసారి ఈ చిత్ర వేడుకకి వచ్చా ఇది కూడా హిట్‌ అవాలి అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

ఇలా కేటీఆర్‌తో రామ్‌ చరణ్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ముడిపడి ఉందా? అన్నట్టు ఉంది.ఈసారి అది వర్కౌట్‌ అయ్యేనా చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube