వరుణ్‌తేజ్‌, సాయి ధరమ్‌తేజ్‌లకు పవన్‌ రోజంతా క్లాస్‌ పీకాడు.. ఎందుకో తెలుసా!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అంటే మెగా హీరోలకు కాస్త భయమే అనే విషయం అందరికి తెల్సిందే.పవన్‌కళ్యాణ్‌ సోదరులకు పవన్‌ అంటే కాస్త ప్రేమ ఎక్కువే.

 Pawan Kalyan Sweet Warning To Sai Dharam Tej And Varun Tej-TeluguStop.com

ఇక వారి తనయులకు మాత్రం పవన్‌ అంటే ఒక రకమైన భయం అంటా! మెగా బ్రదర్స్‌ పిల్లలను ఏం అనలేక పవన్‌్‌తో భయం చెప్పించేవారని తెలుస్తోంది.తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌లో నిర్వహించబడుతున్న ‘నెం.1 యారి’ కార్యక్రమానికి హాజరయిన మెగా బ్రదర్‌ తనయుడు, మెగా ప్రిన్సెస్‌ వరుణ్‌ తేజ్‌ పవన్‌ కళ్యాణ్‌ తమకు పీకిన క్లాస్‌ గురించి చెప్పుకొచ్చాడు.

ే ఇది ఇప్పట్లో జరిగింది కాదంటా.తన చిన్న తనంలో ఉన్నప్పుడు చేసిన అల్లరికి బాబాయ్‌ మామూలు డోస్‌ ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు.నా పుట్టిన రోజు సందర్భంగా నేను సాయి ధరమ్‌ తేజ్‌ మరియు వేరే స్నేహితులు ఉన్నారు.

అంతా బయట పార్టీ అరేంజ్‌ చేసుకున్నాం.

ఇక పార్టీ పూర్తి అయ్యాక మేమే కాస్త హద్దులు దాటి ప్రవర్తించాం.పెద్ద పెద్దగా అరుస్తూ నానా హంగామా చేశాం.అంతేకాకుండా పుట్టిన రోజు సందర్భంగా కోడిగుడ్లను కూడా కొట్టేసుకున్నాం.

దాంతో నాన్న కిటికిలో నుండి చూసి బాబాయ్‌కు కాల్‌ చేసినట్టున్నాడు.ఒక మరుసటి రోజు బాబాయ్‌ మాకు డే అంతా క్లాస్‌ పీకాడు.

ఇంకా చిన్న పిల్లాడిలా ఏంటి ఆ అల్లరి అని తిట్టాడు.దాంతో ఇక ఆ రోజు నుండి అల్లరి చేయడం మానేయాలని ఫిక్స్‌ అయ్యాను అంటూ వరుణ్‌ చెప్పుకొచ్చాడు.వరుణ్‌ తేజ్‌ నటించిన ‘అంతరిక్షం’ చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సౌత్‌లోనే నెం.1 స్పేస్‌ చిత్రంగా ఈ చిత్రం రూపొందింది.ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.

ఈ చిత్రాన్ని ‘ఘాజీ’ ఫేం సంకల్ప్‌ రెడ్డి తెరకెక్కించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube