హెచ్ – 4 వీసాపై విచారణ..!!!

అమెరికా పేరు చెప్తే గతంలో అందరికి గుర్తొచ్చేది లిబర్టీ ఆఫ్ స్టాట్యూ.కాని ఇప్పుడు అమెరికా పేరు చెప్తే గుర్తుకు వచ్చేది మాత్రం హెచ్ -1 వీసా.

 H4 Visa Will Be In Court Order-TeluguStop.com

హెచ్ -4 వీసాలే.ఎందుకంటే అందుకు అనుగుణంగా ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలే అయితే ఈ వీసాల విషయంలో విసిగి వేసారిపోయిన ఎన్నారైలు.

ఎప్పుడు ఏమి జరుగుతుందోనని తెగ హైరానా పడుతున్నారు.ఇదిలాఉంటే

హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా కల్పించే హెచ్‌-4 వీసా వ్యవస్థను సవాలు చేస్తూ గతంలో దాఖలు చేసిన పిటిషన్ ని అమెరికాలోని అప్పిల్లేట్ కోర్టు అనుమతిని ఇచ్చింది.

ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు ఈ హెచ్‌-4 వీసా విధానం అమలులో ఉంది.ఈ విధానం వలన అప్పట్లో దాదాపు లక్షమంది దాకా భారతీయ టెకీల, ఇతర రంగాల వారి సహచరులు అమెరికాలో ఉద్యోగం చేసేవారు.

కానీ ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక అమెరికా ఈ హెచ్‌-4 వీసా విధానానికి గండి కొట్టడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నారైలు.అయితే ట్రంప్ విధానంపై సవాలు విసురుతూ సేవ్‌ జాబ్‌ అమెరికా అనే గ్రూప్‌ గతంలోనే డిస్ట్రిక్ట్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది…అక్కడ కోర్టు సైతం పాత విధానం కి మద్దతు ఇచ్చింది.దీంతో ఆ గ్రూప్‌ అప్పిల్లేట్‌ కోర్టుకు వెళ్ళగా దానిని కోర్టు పెండింగ్‌లో పెట్టింది.మరి ఈ కోర్టులో హెచ్‌-4 వీసా పై ఎటువంటి తీర్పు వెలువడుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు ఎన్నారైలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube