పైరసీని అడ్డుకోవడంలో విశాల్ విఫలమయ్యారని, నిధులను దుర్వినియోగపరచడం, నిర్మాతల సమస్యల్ని పరిషర్కించడంలో కూడా విఫలమయ్యారని ఆరోపిస్తూ కొంత మంది నిర్మాతలు విశాల్‌ను రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్నారు.ఈ విషయమై కొంతకాలంగా వివాదం నడుస్తోంది.
చినికి చినికి వివాదం ముదిరి పెద్దదిగా మారింది.ఈ నేపథ్యంలో విశాల్ ను ముందస్తు జాగ్రత్తలో భాగంగా… పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కి తరలించారు.
అయితే ఆ తరువాత పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం విశాల్ విలేకరులతో మాట్లాడారు.తమ కార్యాలయానికి ఎవరో తాళాలు వేస్తే అడ్డుకుని… పోలీసులు వాటిని తొలగించేందుకు వెళితే అరెస్ట్ చేయడం దారుణమన్నారు.నిర్మాతల మండలి ఐక్యతలో చీలికలు తెచ్చేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.