మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఫేస్‌బుక్‌.. ప్రధాని కొడుకు పోస్ట్‌ను డిలీట్‌ చేసి సంచలనం

ఈమద్య కాలంలో ఫేస్‌బుక్‌ వరుసగా వివాదాలకు నెలవవుతున్న విషయం తెల్సిందే.ఫేస్‌బుక్‌ యూజర్ల వ్యక్తిగత విషయాలను థర్డ్‌ పార్టీ వారికి అమ్మేయడంతో వివాదాస్పదం అయ్యింది.

 Facebook Another Irritable Decision About Prime Minister Son-TeluguStop.com

ఫేస్‌బుక్‌ యూజర్ల వ్యక్తిగత సమాచారంకు భద్రత లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.ఇలాంటి సమయంలో మరో వివాదాస్పద అంశంతో ఫేస్‌బుక్‌ వార్తల్లో నిలిచింది.

పెద్ద ఎత్తున వివాదాలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌ మరో పెద్ద వివాదంలో చిక్కుకుంది.

తాజాగా ఇజ్రాయిల్‌ ప్రధాని కొడుకు పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో పెద్ద ఎత్తున వివాదం మొదుంది.దాంతో ఫేస్‌బుక్‌ ఆ పోస్ట్‌ను అనుమతి లేకుండా తొలగించింది.ప్రధాని తనయుడు పెట్టిన పోస్ట్‌ను తొలగించడంతో ఇజ్రాయిల్‌ పెద్దలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌ చిక్కుల్లో పడ్డట్లయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఇజ్రాయిల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ తనయుడు jైుర్‌ నెతన్యాహు ముస్లీంలకు వ్యతిరేకంగా పోస్ట్‌ పెట్టిన విషయం తెల్సిందే.ఇజ్రాయిల్‌లో శాంతి కావాలంటే యూదులైనా వెళ్లి పోవాలి, లేదంటే ముస్లీంలు అయినా వెళ్లి పోవాలి.ముస్లీంలు వెళ్లిపోతే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ పోస్ట్‌ చేశాడు.

జపాన్‌లో ముస్లీంలు లేకపోవడం వల్లే అక్కడ ఎలాంటి గొడవలు లేవు అని, వారు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నాడు.ఈ పోస్ట్‌కు ముస్లీంలు తీవ్రంగా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఫేస్‌బుక్‌ ఆ పోస్ట్‌ను తొలగించింది.

తన ఫేస్‌బుక్‌ నుండి పోస్ట్‌ చేయడంతో ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున ఫేస్‌బుక్‌ పై విమర్శలు చేశాడు.తన వ్యక్తిగత విషయాలను చెప్పే స్వేచ్చ కూడా నాకు లేదా అంటూ ప్రశ్నించాడు.ఫేస్‌బుక్‌ తీరుపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube