ఆ కంపెనీ టాల్కమ్‌ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు ...? భారత్ లో శ్యాంపిల్స్ సీజ్ !

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టాల్కమ్‌ పౌడర్‌లో ఉన్న ఆస్బెస్టాజ్‌ వల్ల అండాశయ కేన్సర్‌ వచ్చిందని 22 మంది మహిళలు కోర్టుకెక్కారు.దాంతో వీరికి 31,000 కోట్లు చెల్లించాలని సెయింట్ లూయిస్ లోని ఒక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 Johnson Johnsonbaby Powder Samples Seized In India-TeluguStop.com

తాత్కాలిక పరిహారం కింద 3500 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.కొద్ది సమయంలోనే ఈ పూర్తి స్థాయి పరిహార ఆదేశాలను ప్రకటించడం గమనార్హం.జూన్‌ 4న మొదలైన ఈ కేసులో బుధవారం చివరి దశ వాదనలు జరిగాయి.అయితే….జాన్సన్ బేబీ పౌడర్‌కు సంబంధించిన వార్తల పై … భారత ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని జాన్సన్ బేబీ పౌడర్ ప్లాంట్‌ నుంచి శాంపిళ్లను డ్రగ్ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం.ఆస్బెస్టాస్ ఆనవాళ్లను పరీక్షించడానికి సీడీసీఎస్ఓ అధికారులు పౌడర్ శాంపిళ్లను సీజ్ చేశారని రాయిటర్స్ తెలిపింది.మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన అత్యున్నత స్థాయి భేటీలో జాన్సన్ బేబీ పౌడర్ ప్లాంట్‌లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు.

జాన్సన్ బేబీ పౌడర్ శాంపిళ్లను సీజ్ చేసిన విషయంలో స్పందించడానికి సీడీసీఎస్ఓ అధికారులు నిరాకరించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube