ధోని భార్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు.. భార్య భర్తల సరదా సంఘటన, ఆమెను చెప్పుతో కొడతామంటున్నారు

ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు సచిన్‌ తర్వాత అత్యధికంగా అభిమానించే క్రికెటర్‌ అంటే ధోని అని చెప్పనక్కర్లేదు.టీం ఇండియాకు ఎన్నో విజయాలను తెచ్చి పెట్టిన ధోని ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో ది లెజెండ్‌ గా నిలిచి పోతాడు.

 Ms Dhoni Spotted Tying Wife Sakshis Shoe Buckle-TeluguStop.com

టీం ఇండియా కెప్టెన్‌గా ఎన్నో అద్బుతమైన విజయాలను అందించిన ధోని గురించి ఎవరైనా ఏ చిన్న మాట అన్నా కూడా ఆయన అభిమానులు ఊరుకునేది లేదు అంటారు.చివరకు ఆయన భార్య అయినా కూడా ధోని అభిమానులు రెచ్చి పోతారు.

తాజాగా ధోని అభిమానులు ఆయన భార్య అయిన సాక్షిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…


ధోని భార్య సాక్షి తాజాగా సోషల్‌ మీడియాలో ఒక ఫొటో పోస్ట్‌ చేసింది.ఆ ఫొటోలో ధోని ఆమెకు చెప్పులు తొడుతున్నాడు.క్రికెట్‌ దేవుడు చెప్పులు తొడగటంను ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఆమె పొగరు అంటూ తిడుతున్నారు.చెప్పు తొడిగే ఫొటోతో పాటు నీవల్ల విప్పిన చెప్పులను నువ్వే తొడగాలి అంటూ కామెంట్‌ పెట్టింది.

సాక్షి బలుపుకు ధోని అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరీ ఇలాంటి వేశాలు ఏంటీ అంటూ ఆగ్రహంతో కామెంట్స్‌ చేస్తున్నారు.

ధోని మీ భర్త అయ్యి ఉండవచ్చు, కాని ఆయన దేశానికి క్రికెట్‌ దేవుడు.ఆ విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.చెప్పులు వేయించుకోవడం అనేది మీ వ్యక్తిగత విషయం.కాని అది పబ్లిక్‌గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు అంటూ సాక్షికి సోషల్‌ మీడియా జనాలు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు.

గతంలో కూడా ధోని భార్య అసభ్యకర కాస్ట్యూమ్స్‌ వేసుకోవడంతో పాటు, ఒక హీరోయిన్‌ స్థాయిలో ఫీల్‌ అవుతూ వచ్చింది.అప్పుడు కూడా మీరు ఒక గొప్ప క్రికెటర్‌ భార్య అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

సాక్షిపై సోషల్‌ మీడియాలో విమర్శలను కొందరు తప్పుబడుతున్నారు.వారు సెలబ్రెటీస్‌ అయినంత మాత్రాన వ్యక్తిగత జీవితాలు ఉండవా, వారి ఇష్టానుసారంగా నడుచుకునే వీలు ఉండదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

వారిద్దరి మద్య సరదాగా జరిగిన విషయాన్ని మరీ ఇంతలా రచ్చ చేయడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube