2 ఏళ్ల పాపను నీటిలో ముంచాడు.. ఓరి నీ మొహం మండ, ఇదేం భక్తిరా నాయన!

దేవుడిని నమ్మాలి కాని మూడంగా, మూర్ఖంగా నమ్మొదు.మూడ నమ్మకంగా దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు.

 Baptism Church Children Violent Ducking Water Aggressive Baptism-TeluguStop.com

దేవుడిని మనస్ఫూర్తిగా పూజిస్తే చాు.కాని కొందరు మాత్రం దేవుడి పూజా అంటూ ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది.ఏ మతంలో కూడా, ఏ దేవుడు కూడా పిల్లలను హింసిచమని, చనిపోయే వరకు కొట్టమని, తమ కోసం ప్రాణాలు ఇవ్వమని మాత్రం చెప్పలేదు, అడగలేదు.కాని రష్యాకు చెందిన బాప్టిజం పూజారి అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు.

తన వద్దకు స్వస్థత కోసం వచ్చిన వారిని అత్యంత హీనంగా శారీరకంగా శిక్షిస్తాడు.పెద్దా చిన్నా అనే తేడా లేకుండా వారిని శారీరకంగా హింసించి వారిని స్వస్థత చేస్తానంటాడు.తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున హల్‌ చల్‌ చేస్తోంది.


రెండు సంవత్సరాల పాపను అనారోగ్యం కారణంగా తల్లిదండ్రులు ఆయన వద్దకు తీసుకు వెళ్లడం జరిగింది.ఆ సమయంలో ఏదో మంత్రించి పెద్ద పాత్రలో ఉన్న నీటిలో పడేశాడు.

నీటిలో బాబు పడేయడంతో గిలిగిల కట్టుకున్నాడు.కొద్ది సేపు మొత్తం ముంచి ఉంచిన ఆ పూజారి పైకి తీయగానే ఆ బాబు నీటిని కక్కడంతో పాటు కొద్ది సమయం కకావికలం అయ్యాడు.దాంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది మరీ ఇలాంటి వైధ్యం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో విషయం కాస్త సీరియస్‌ అయ్యింది.ఆ బాప్టిజం పూజారిని పోలీసులు అరెస్ట్‌ చేసినా కూడా ఇలాంటి సంఘటనలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube