అసలు ఓడిపోవడానికి రీజన్ ఏంటి...? కారణాలు వెతుకుతున్న కాంగ్రెస్

అసలు తెలంగాణాలో తప్పనిసరిగా అధికారం దక్కుతుంది అని అంతా అంచనాలు వేశారు.టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కటిగా ఒకచోటుకి చేరిపోయాయి.

 Telangana Congress Finding Reasons About Faild In Elections-TeluguStop.com

కూటమిగా ఏర్పడ్డాయి… సీట్లు పంచుకున్నాయి.ఓటర్ల నాడి కూడా కూటమికే ఓటు అన్నట్టుగా పరిస్థితులు కనిపించాయి.

కట్ చేస్తే… కూటమి కుదేలయ్యింది.అధికారం మళ్ళీ అందని ద్రాక్షే అనుకున్న టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం దక్కించుకుంది.

ఊహించని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూసింది.పార్టీలో టాప్ మోస్ట్ సీనియర్ నాయకులంతా ఓటమి చవి చూసారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసలు మనం ఎందుకు ఓడిపోయాము అనే విషయాలపైనా దృష్టిపెట్టింది.ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తే… ఇలా అయ్యింది ఏంటి .? అసలు ఓటమి కారణాలేంటి? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ కాంగ్రెస్ సమీక్ష మొదలుపెట్టింది.

ఈ సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ సీనియర్లు, అభ్యర్థులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ భేటీ అయ్యారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహించారు.జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డితో పాటు పలువురు పార్టీ సీనియర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ గాంధీభవన్‌లో సమావేశానికి హాజరయ్యారు.ఓటమికి కారణాలతో పాటు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఆధారాలను సేకరించడంపై కూడా టీపీసీసీ నేతలు దృష్టి సారించారు.

అసలు ఎన్ని వివాదాలు చెలరేగినా… ఎంతమంది అడ్డు చెప్పినా… తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం గా విభజిస్తే… ఆ ఫలితం ఎందుకు పొందలేకపోతున్నాము అనే చర్చ మొదలుపెట్టారు సమావేశానికి హాజరయిన నాయకులు.అసలు గెలుపు కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎందుకు ఇంత ఓటమిని సవిచూడాల్సి వచ్చిందనే దానిపై నే చర్చ అంతా సాగింది.

కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్లి ఉంటే బాగుండేదని… అలా కాకుండా… టీడీపీ తో పొత్తు పెట్టుకుని చాలా తప్పు చేశామని… అసలు ఆ పొత్తే పార్టీ కొంప ముంచింది అని చాలామంది అభిప్రాయపడ్డారు .ఇదే విషయంపై తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రిపోర్టు కూడా అందించారట.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై రాహుల్‌కు నివేదికను ఇచ్చిన ఆ నేత.ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, పీసీసీ చీఫ్ సహా కార్యవర్గం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు రాకతో తెలంగాణలో ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ బాబుగా మారిందని కూడా వివరణ ఇచ్చారు.సమావేశంలో పాల్గొన్న వారంతా .తమ ఓటమి కారణాలుగా టీడీపీ తో పొత్తు… ఈవీఎం మిషన్ ల పైన అనుమానాలను సాకుగా చూపించుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube