ఫేస్ 'బుక్' అయ్యారా ...? అయితే ఇది మీకోసమే !

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ హవా గురించి ఎవరికీ పెద్దగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే స్కూల్ కి వెళ్లే పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఈ ఫేస్బుక్ కి బానిస అయినవారే.ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రలోకి జారుకునేంతవరకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా ఇందులోనే మునిగి తేలుతున్నారు.

 Time Controll Option Launched By Facebook-TeluguStop.com

కేవలం ఇదొక్కటే కాదు… వాట్సప్, ట్విటర్ ఇటువంటి ఫ్లాట్ ఫాంల మీద రోజంతా గంటలు తరబడి గడిపేస్తున్నారు.ఇదంతా వ్యసనం కింద మారిపోవడంతో… వీటి నుంచి బయటపడాలని భావిస్తున్నవారు ఉన్నారు.

అలాంటి వారి కోసం ఫేస్ బుక్ ఓ చక్కటి అవకాశాన్ని కల్పించింది.అదే యువర్ టైం అనే ఫీచర్.

ఈ ఫీచర్ తో రోజుకు ఎంత సమయం ఫేస్ బుక్ కేటాయిస్తున్నారో తెలుసుకోవచ్చు.ఈ ఫీచర్ ను యూజర్లు ఫేస్ బుక్ యాప్ లోకి వెళ్లి మోర్ ట్యాబ్ లో ఉండే సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ విభాగం నుంచి పొందవచ్చు.అక్కడే యువర్ టైం ఆన్ ఫేస్బుక్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది.దాన్ని సెలక్ట్ చేసుకుంటే పైన చెప్పిన విధంగా ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు.ఫేస్బుక్లో కొద్ది సమయం మాత్రమే గడపాలని కోరుకునే వారు ఈ ఫీచర్ సహాయంతో ఫేస్బుక్ యాప్లో రిమైండర్ సెట్ చేసుకోవచ్చు.దీంతో నిర్దేశిత సమయం ఫేస్బుక్లో గడపగానే యూజర్లకు వెంటనే అలర్ట్ వస్తుంది.

దాంతో ఫేస్బుక్ ను వాడడం ఆపేయవచ్చు.అయితే ఇది ఎంతవరకు ఉపయోగకరం అనే వాదన కూడా తెరపైకి వస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube