వట్టి చేరిక కన్ఫర్మ్ అయ్యింది..!!!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వివిధ పార్టీ లోకి సీనియర్ నేతలు చేరికలు ఊపందుకున్నాయి.గతంలో చక్రం తిప్పి విభజన తర్వాత సైలెంట్ గా ఉన్న ఎంతోమంది ప్రజాబలం ఉన్న నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

 Vatti Vasanth Kumar Joining In To Ysr Congress Party-TeluguStop.com

అయితే ఆ పోటీ కాంగ్రెస్ నుంచి చేయాలా లేదంటే వివిధ పార్టీల ఆహ్వానాల మేరకు బలమైన పార్టీలోకి చేరాలా అనే సందిగ్ధంలో ఉండిపోయారు.ఈ క్రమంలోనే చంద్రబాబు, కాంగ్రెస్ ల అనైతిక పొత్తు తో విసుగెత్తిపోయిన కాంగ్రెస్ సీనియర్స్ ఇప్పుడు తలోదారి చూసుకుంటున్నారు.

ఈ కోవలోనే కొంతకాలం క్రితం అంటే రాహుల్ ని చంద్రబాబు కలిసి శాలువా కప్పిన రోజునే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది అయితే.

పశ్చిమలో అందులోనూ ఉంగుటూరు లో మంచి పట్టు ఉన్న నేతగా ఉన్న వట్టి వసంత్ కుమార్ కి అటు జనసేన నుంచి ఇటు వైసీపీ నుంచి ఆహ్వానాలు వచ్చినా ఆయన మాత్రం రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.వచ్చేనెల మూడవ తేదీన ఆయన తన అనుచరులతో భేటీ అయి వారి మనోగతాలు మేరకు తాను ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయించుకోబోతున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఆయన రాజీనామా చేసిన తర్వాత చాలామంది వట్టి వసంత్ జనసేనలోకి వెళతారని ఇప్పటికే జనసేన తో టచ్ లో ఉన్నారని, ఎన్నో రకాల ఊహాగానాలు రావడంతో అవన్నీ అవాస్తవమని తన అనుయాయులు కొట్టిపడేశారు.దాంతో జనసేన లోకి వెళ్లే అవకాశం లేనట్లుగానే తెలుస్తోంది.అయితే ఇటీవల ఆయన బహిరంగంగానే అభిమానుల దగ్గర వైసీపీ లోకి వెళ్ళాలని, వెళ్తే ఎలా ఉంటుంది అనే చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

అతి త్వరలోనే ఆయన గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఉంగుటూరు నే వేదికగా చేసుకుని వైసీపీ తరఫున పోటీ చేయడం ఖాయమని ఈ విషయంపైనే త్వరలో అభిమానులతో చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube