కేసీఆర్ కంగారుకి...కూటమి ఉత్సాహానికి ఆయనే కారణమా ..?

ప్రస్తుతం తెలంగాణాలో టఫ్ ఫైట్ నడుస్తోంది.పోలింగ్ తేదికి ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు.

 Kcr Fears With Mahakutami-TeluguStop.com

ఎన్నికల్లో అధికారం తమకు దక్కుతుంది అంటే తమకు దక్కుతుంది అనే ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి.టీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలనీ మహాకూటమిలోని పార్టీలు భావిస్తుంటే… ఆ కూటమిని బొందపెట్టాలంటూ కేసీఆర్ పిలుపునిస్తూ … ముందుకు వెళ్తున్నాడు.

ఇక్కడ నుంచి తిరిగి గెలిచి అధికారంలోకి రావాలని తాజా మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.నిజానికి ఆయనకు మరో ఆరు మాసాల పాలనా గడువు ఉండగానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తుకు వెళ్లారు.

అయితే కేసీఆర్ లో అప్పుడు కనిపించిన దమ్ము, ధైర్యం, ధీమా వంటివి ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు.పైకి కేసీఆర్ ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం కంగారు పడుతూనే ఉన్నాడు.కనీసం తమకు 100 సీట్లు వస్తాయని ప్రభుత్వాన్ని రద్దు చేసిన సమయంలో కేసీఆర్ వెల్లడించారు.అయితే, ఇది ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ ధీమా సన్నగిల్లుతోంది.

ఆంతరంగిక చర్చల్లో.కేకే.

నాయిని.హరీష్ రావు.

వంటి దిగ్గజాలతో చర్చిస్తున్న సమయంలో కనీసం మనకు 80 వస్తాయా? అని కేసీఆర్ ప్రశ్నించడం ఆయనలో ఉన్న భయాన్ని తెలియజేస్తోంది.

ఇక కూటమి విషయానికి వస్తే… ఈ కూటమికి తెరచాటున కర్త కర్మ, క్రియ అన్నీ కూడా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కావడమే! తెలంగాణాలో తాను ఒంటరిగా ఏమీ చేయలేనని గుర్తించిన చంద్రబాబు.వ్యూహాత్మకంగా తమ కు ఆగర్భ శత్రు పార్టీ అయినా కూడా.కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.

మొదట్లో దీనిని ఊహించని కేసీఆర్‌.ఇప్పుడు ఇది తనకు ఎర్త్ పెడుతుందని సర్వే నివేదికలు వెల్లడిస్తుండడంతో తల్లడిల్లిపోతున్నారు.

అందుకే కేసీఆర్ కాంగ్రెస్‌ను తక్కువగా .బాబును ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.దీనికి ప్రధాన కారణం.కాంగ్రెసను పరోక్షంగా చంద్రబాబే నడిపిస్తున్నారనేది కేసీఆర్ భావనగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube