ఓయ్‌ చైతూ ఏంటీ ఇంత స్పీడ్‌.. కాస్త మెల్లగా బాబు

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా ప్రస్తుతం ‘మజిలి’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

 Naga Chainanya And Samantha Majili Movie First Look-TeluguStop.com

గత నెలలోనే ప్రారంభం అయిన ఈ చిత్రం అప్పుడే సగానికి పైగా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన వివరాలు తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు వెళ్లడి చేశారు.

ఇక నేడు నాగచైతన్య పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయడం అక్కినేని ఫ్యాన్స్‌కు చాలా ఆశ్చర్యంను కలిగిస్తోంది.

కేవలం నెల రోజుల్లోనే సినిమాను సగంకు పైగా ఎలా పూర్తి చేశారు అంటూ సినీ వర్గాల వారు కొందరు ప్రశ్నిస్తున్నారు.సినిమాను స్పీడ్‌గా చేస్తే కంటెంట్‌ పరంగా బలంగా ఉండదేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.అందుకే కాస్త జాగ్రత్తగా ఆలస్యం అయినా పర్వాలేదు, మెల్లగా సినిమాను చిత్రీకరించాలంటూ అక్కినేని ఫ్యాన్స్‌ దర్శకుడు శివ నిర్వాణను కోరుతున్నారు.మొన్నటి వరకు విశాఖపట్నం, సింహాచలం ఏరియల్లో చిత్రీకరించిన ‘మజిలి’ చిత్ర యూనిట్‌ సభ్యులు ఈనెల 26న తర్వాత షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలు పెట్టబోతున్నారు.

పెళ్లి తర్వాత ఈ జంట నటిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.షూటింగ్‌ ప్రారంభం అయ్యి నెల కూడా కాలేదు, సగం పూర్తి చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు వచ్చే నెల అంటే డిసెంబర్‌ లో సినిమాను పూర్తిగా చిత్రీకరిస్తాడట.జనవరి రెండవ లేదా మూడవ వారం వరకు మొత్తం పనులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవ్వనుందట.ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

మరీ ఇంత స్పీడ్‌ వద్దని, నాగచైతన్యకు కొందరు సలహా ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube