ఇదేం కూటమి...? పొత్తు అంటూనే పోటీనా .. ?

టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ… తెలంగాణాలో ‘చేయి’ కలిపి మరీ కూటమిగా ఏర్పడ్డాయి.టీఆర్ఎస్ ఓటమే లక్ష్యం గా పనిచేస్తూ … ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నాయి.

 Telangana Congress Rebels Participating With Mahakutami Candidates-TeluguStop.com

పార్టీలన్నీ విడివిడిగా ఎన్నికల బరిలోకి వెళ్తే… మళ్ళీ టీఆర్ఎస్ కి అధికారం దక్కే ఛాన్స్ ఉందనే భావనతో విపక్ష పార్టీలన్నీ … కూటమిగా ఏర్పడి ముందుకు సాగుతున్నాయి.ఒకవైపు తాము కేసీఆర్ ఆట కట్టించడానికి చేతులు కలిపామని టీఆర్ఎస్ఈ పార్టీలు.

ప్రజావ్యతిరేక ఓటు చీలకూడదని తాము జత కలిసినట్టుగా చెప్పుకుంటున్నాయి.గత ఎన్నికల్లో కూడా ఈ విధంగానే … టీఆర్ఎస్ అధికారం దక్కించుకుంది.

ఈసారి ఆ విధంగా జరగకూడదనే ఆలోచనతో… ముందుగానే పార్టీలన్నీ ఒక్కటయిపోయాయి.

కానీ నామినేషన్లు చివరి తేదీ నాటికి కూటమిలో ఐక్యత దెబ్బతినేసింది.పెద్దన్న పాత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ మిత్ర పక్ష పార్టీలకు ‘ చేయి’ ఇచ్చేసింది.మిత్ర పక్ష పార్టీలకు కేటాయించిన సీట్లలో సైతం కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపి వాటికి ఝలక్ ఇచ్చింది.

ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో … మాత్రం కూటమిలోని పార్టీల మధ్యే పోటీ తప్పని పరిస్థితి ఏర్పడింది.అటు టీడీపీ నామినేషన్స్ వేసిన కొన్ని సీట్లలో ఇటు టీజేఎస్ రంగంలోకి దిగిన కొన్ని సీట్లలో కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు అయ్యాయి.

పొత్తుల్లో భాగాంగా… టీజేఎస్ కు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు ఇచ్చింది.వాటిల్లో మూడు స్థానాల్లో కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలయ్యాయి.అలాగే టీడీపీకి ఇచ్చిన సీట్లలో కూడారెండు చోట్ల కాంగ్రెస్ నామినేషన్స్ వేసింది.ఇలా ఐదు సీట్లలో కాంగ్రెస్ పొత్తును ఉల్లంఘించగా.తమ వంతుగా టీజేఎస్ కూడా పొత్తును ఉల్లంఘించింది.ఆ పార్టీ ఆరు స్థానాల్లో అదనంగా నామినేషన్స్ వేసింది.

ఎనిమిది సీట్లు ఆ పార్టీకి దక్కగా ఫ్రెండ్లీ పోటీ అంటూ మరో ఆరు స్థానాల్లో టీజేఎస్ నామినేషన్స్ దాఖలు చేసింది.దీంతో అందులో ఉన్న పార్టీలు ఇదేంటి కూటమి అని ఏర్పడ్డాక ఇలా ఫ్రెండ్లీ పోటీ ఏంటి.? అలా అయితే ఎవరి దారిన వారు విడివిడిగా పోటీ చేస్తే సరిపోతుంది కాదా అంటూ పెదవి విరుస్తున్నారు.అంతే రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది కదా మరి.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube