ఈ దీవాళి రోజు ఉప్పుతో ఈ 6 రకాలుగా చేస్తే డబ్బే డబ్బు..! తప్పక చేయండి..!

లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపావళి రోజున, ఉప్పు నింపిన గాజు సీసాని ఇంట్లో ఏదో ఒక మూల గాని, స్నానాల గదిలో గాని పెడితే నెగటివ్ ఎనర్జీలు అన్ని బయటకు పోయి, లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందనేది ఒక నమ్మకం.దీన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేసేవారు కొందరు.

 Why Should We Bring Salt On Diwali-TeluguStop.com

నమ్మకంతో ఆచరించేవారు మరికొందరు.ఏదేమైనప్పటికీ ఉప్పు వలన మన ఆరోగ్యానికి ప్రయోజనంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మనకు ఉపయోగపడుతుంది.అవేంటో తెలుసా?

1.ఉప్పు తో దిష్టి తీయడం పాత కాలం నుంచి చూస్తున్నదే.ఇంట్లో ఎవరికయినా దిష్టి తగిలినట్టు అనిపిస్తే, గుప్పెడు ఉప్పుని తీసుకుని దిష్టి తగిలిన వారిపై మూడు సార్లు తిప్పి పడేయడం చూస్తూ ఉంటాం.తద్వారా దిష్టి పోతుందని నమ్మకం.

2.అంతే కాదు స్నానాల గదిలో ఒక మూల గాజు బౌల్ తో ఉప్పుని పెడితే, వాస్తు దోషం ఉండదట.ఇలా చాలా మంది చేస్తుంటారు.దోషం మాట అటుంచితే ఉప్పు ని పెట్టడం వలన క్రిమికీటకాలు అయితే పోతాయి.

3.రాహువు వలన వచ్చే నెగటివ్ ఎనర్జీ పోవాలంటే, రాహువుకి ఇష్టమైన గాజు బౌల్ లో ఉప్పు వేసి పెడితే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండదు.

4.కళ్లుప్పుని తీసుకుని, ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దాన్ని ఇంటి ముఖద్వారానికి కడితే దానికింద నుంచే ఇంట్లోకి ఏదైనా, ఎవరైనా వచ్చిపోతూ ఉంటె ఆందోళన పోయి అంతా మంచి జరుగుతుందట.మనసులో ఏమైనా ఆందోళన ఉన్నా కూడా పోతుంది.అంతేకాదు ద్వారం దగ్గర కూడా ఒక గిన్నెలో ఉప్పుని వేసి పెడితే దిష్టి పోతుంది.

5.ఈ మూట ని వ్యాపార స్థలంలో ముఖద్వారంతో పాటు, మీ బీరువాలో కూడా పెట్ట్టుకోవాలట.

అలా చేయడం వలన వ్యాపారంలో మంచి లాభం వస్తుందని పండితులు వెల్లడిస్తున్నారు.

6.పడుకునే ముందు చిటికెడు ఉప్పు నీళ్ళలో వేసి కాళ్ళు చేతులు కడుక్కుంటే, సుఖ నిద్ర పట్టడమే కాకుండా అంతా మంచి జరుగుతుందట.పిల్లలకు వారానికి ఒకసారి చికెడు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయిస్తే రోగాలు ఎక్కువగా రావని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube