స్వీపర్ జీతం లక్షన్నరా??వాట్సప్లో వైరలవుతున్న పే స్లిప్ చూసి షాకవుతున్న నెటిజన్లు...

ఇటీవల వాట్సాప్‌లో తెగ వైరలైంది ఒక పే స్లిప్‌!అది చూసినవాళ్లంతా అవునా.నిజ్జమా…స్వీపర్‌కు లక్షన్నరజీతమా! ఇదేదో ఫేక్‌ అయి ఉంటుంది!’ అని అనుకున్నారు.కానీ… ఇది అక్షరాలా నిజం అని తెలిసాక అందరూ నోరెళ్లబెట్టారూ.స్వీపర్ మొత్తం జీతం 1,47,722 రూపాయలు.

 Kola Venkata Ramanamma Gets One Lack For Her Salary-TeluguStop.com

ఇది చూసాక స్వీపర్ పనే బాగుంది…లక్షన్నర.మన బతుకులూ ఉన్నాయి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టూ వాపోతున్నారు చాలామంది…సరే ఇంతకీ ఆ స్వీపర్ ఎవరూ.ఆ ప్లే సిప్,ఆ జీతం వివరాలేంటి చూద్దామా…

రాజమహేంద్రవరం తాడితోట ప్రాంతానికి చెందిన కోల వెంకటరమణమ్మ ప్లే సిప్పే ఇప్పుడు వాట్సప్లో వైరలవుతుంది.ఆమె ఏమీ చదువుకోలేదు.కానీ తన సంతకం మాత్రం పెట్టేంత అక్షరాలు నేర్చుకుంది.1978లో విద్యుత్ శాఖలో డెయిల్ వేజ్ లేబర్ గా చేరింది వెంకటరమణమ్మ.అప్పుడు ఆమె వయసు పదహారు సంవత్సరాలు.ఆమె చేరిన మూడేళ్లకు అంటే 1981 ఏప్రిల్‌ 1న రమణమ్మ పర్మినెంట్‌ ఎంప్లాయ్‌ అయ్యారు.అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయంలోని పని చేస్తున్నారు.ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్లు దాటింది.

రిటైర్‌మెంట్‌కు మరో నాలుగేళ్లు ఉంది.చాలా కాలంగా చేసిన సర్వీసు కావడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది.

రమణమ్మ ఉదయం 8 గంటలకు భోజనం డబ్బాతో వచ్చి… రాత్రి 8 గంటలకు ఇంటికి వెళతారు.ఆమె తల్లి కూడా అక్కడే స్వీపర్‌గా పని చేసేవారు.

రమణమ్మ అంటే అందరికీ గౌరవం.తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసే రమణమ్మ అంటే అందరికి గౌరవం… రమణమ్మకు ఇద్దరు కొడుకులు.రైల్వేలో చేసే భర్త వీరభద్రరావు చనిపోవడంతో ఆయన ఉద్యోగం ఒక కొడుక్కి వచ్చింది.మరో కొడుకు గుండె జబ్బు, ఫిట్స్‌తో బాధపడుతున్నాడు…ఇదీ రమణమ్మ కథ…అయితే ఆ జీతం విషయం తెలుసుకుందాం.

రమణమ్మ మాత్రమే కాదు… ఇలా లక్షకు పైబడి జీతం తీసుకునే నాలుగో తరగతి ఉద్యోగులు డిస్కమ్‌లలో చాలామందే ఉన్నారు.విద్యుత్తు శాఖలో ఉద్యోగం అంటే… వేతనాల వరం పొందినట్లే.ఇదంతా సంస్కరణల ఫలం! మొదట్లో విద్యుత్తు శాఖను ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ర్టిసిటీ బోర్డు అని పిలిచేవారు.బోర్డు పోయింది.‘కంపెనీ’లు వచ్చాయి.విద్యుత్తు ఉత్పత్తికి.జెన్‌కో! సరఫరాకు.ట్రాన్స్‌కో ఏర్పడ్డాయి.ట్రాన్స్‌కోలో మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్‌లను ఏర్పాటు చేశారు.అయితే పదవీ విరమణ తర్వాత పెన్షన్లు రావనే అప్పట్లో ఈ డిస్కమ్ లను వ్యతిరేఖించారు.

ఉద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు భారి ఎత్తున వేతనాలు పెంచారు.దాని ఫలితమే ఈ జీతాలు… సర్వీసు బాగా ఉన్న స్వీపర్‌, అంటెండర్ల జీతం ఐదంకెలను దాటి ఆరు అంకెల్లోకి చేరింది.

ట్రాన్స్‌కో సీఎండీకంటే 30 ఏళ్ల సర్వీసు ఉన్న చీఫ్‌ ఇంజనీర్‌ జీతమే ఎక్కువఉండడం విశేషం!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube