కాస్టింగ్‌ కౌచ్‌.. అమ్మాయిలదే తప్పంటున్న హీరోయిన్‌

తెలుగు సినిమా పరిశ్రమతో పాటు దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లోనూ కాస్టింగ్‌ కౌచ్‌ దారుణంగా ఉంది.సినీ పరిశ్రమతో పాటు ఇతర రంగాల్లోనూ ఈరకమైన లైంగిక దోపిడి ఉందంటూ ప్రచారం జరుగుతుంది.

 Mamta Mohandas Comments On Casting Couch-TeluguStop.com

కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంపై టాలీవుడ్‌కు చెందిన శ్రీరెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది.ఆమె పలువురు సినీ ప్రముఖుల జీవితాలను బయట పెట్టింది.

ఏమాత్రం ఇబ్బంది పడకుండా తనను ఇబ్బంది పెట్టిన అందరి పేర్లను బయటకు తీసుకు వచ్చింది.ఇంకా ఎంతో మంది పేర్లను కూడా తీసుకు వస్తాను అంటూ హెచ్చరించింది.

ఇటీవలే తమిళ సినీ ఇండస్ట్రీపై కూడా ఈమె పడటం జరిగింది.

కొందరు కాస్టింగ్‌ కౌచ్‌తో అమాయకపు అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి అంటూ ఆందోళన చెందుతున్నారు.

మరి కొందరు మాత్రం అమ్మాయిల అమాయకత్వమే వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయని అంటున్నారు.ఇక ఎలాగైనా అవకాశాలు దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో అమ్మాయిలు స్వయంగా కాస్టింగ్‌ కౌచ్‌కు ముందుకు రావడం కూడా జరుగుతుందని అంటున్నారు.

ఇక తాజాగా హీరోయిన్‌ మమత మోహన్‌ దాస్‌ ఈ విషయంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమత మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ.అమ్మాయిలు గడుసుగా ఉండటం వల్ల కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా అందమైన అమ్మాయిలను అబ్బాయిలు వాడుకోవాలని ట్రై చేస్తారు.అందుకే అందంగా లేని అమ్మాయిలు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది.అందమైన అమ్మాయిలపై కుర్రాళ్లు చిన్న కామెంట్స్‌ చేయడం కామన్‌.

ఆ కామెంట్స్‌కు ఎక్కువగా రియాక్ట్‌ అయితే అవతలి వారి ఈగో హర్ట్‌ అయ్యి రేప్‌ల వరకు వెళ్తారు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఉంది.

అయితే అవకాశాల కోసం వెళ్లే ఆడవారి బలహీనను హీరోలు, దర్శకులు క్యాష్‌ చేసుకుంటారు.అదే స్ట్రాంగ్‌గా ఉండి, అవకాశం వస్తే వచ్చింది లేదంటే పర్వాలేదు అనుకునే హీరోయిన్స్‌ను ఎప్పుడు కూడా వారు బలవంతం చేయరు అంటూ మమత మోహన్‌ దాస్‌ చెప్పుకొచ్చింది.

కాస్టింగ్‌ కౌచ్‌లో మగవారి తప్పుకంటే ఆడవారిదే ఎక్కువ తప్పు ఉంటుందని ఈ సందర్బంగా మమత మోహన్‌ దాస్‌ చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube