జాతీయ రాజకీయాలపై చంద్రబాబు ఆసక్తి ... ఎంపీగా బరిలోకి ..?

రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబుకి మొహం మొత్తినట్టుంది అందుకే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెగ ఆరాటపడిపోతున్నాడు.అందుకే గత కొంతకాలంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ అధినేతలతో మంతనాలు జరుపుతున్నాడు.

 Chandrababu Contesting As Mp-TeluguStop.com

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన వివిధ పార్టీల అధినేతలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటై ఒక ఫ్రెంట్ గా ఏర్పడాలని నిర్ణయించుకున్నారు.ఈ దశలోనే చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ రాష్టంలో ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా కేంద్రంలో రాజకీయం నడపొచ్చని బాబు ఆలోచన.

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో తాజాగా ఇటీవల నిర్వహించిన అనేక సర్వేల్లో టీడీపీకి ఎదురుగాలి వీచే అవకాశం ఉన్నట్టు తేలిందట.రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోతే.జాతీయ పార్టీలైన బీజేపీ -కాంగ్రెస్ పార్టీలు కూడా స్ప్రష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదు కనుక ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి జాతీయ రాజకీయాలలో చంద్రబాబు చక్రం తిప్పేందుకు ఎంపీ గా బరిలోకి దిగాలని చూస్తున్నాడని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే .వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే గా రెండు చోట్ల నుండి ఎన్నికలలో పోటీ చేసెందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొన్నట్లు తెలుస్తోంది.గత మూడు నెలల నుంచి పార్టీ పరిస్థితి పై ఆయా నియోజకవర్గాల్లో ఫ్రొఫెసర్ల తో రహస్య సర్వే చేపట్టారు.40 నియోజకవర్గాల్లో పార్టీ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వే ద్వారా తేలింది.అనుకూ ముందు జాగ్రత్తగా ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా.కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు.

అదీకాకుండా ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు కూడా బాగా పుంజుకున్నాయి.ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనా పార్టీ పట్టు సాధిస్తుండడం, వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర కు ప్రజల నుంచి స్పందన రావడంతో చంద్రబాబుకి భయం పట్టుకుందని అనుకూ ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతోనే ఎంపీ , ఎమ్యెల్యేగా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల అనంతర పరిణామాలను బట్టి ఒక పదవికి రాజీనామా చెయ్యాలని బాబు ఉద్దేశం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube