భర్త రోజు కొడుతున్నాడని ఆమె డాక్టర్ దగ్గరికెళ్తే...డాక్టర్ ఏం మందు ఇచ్చారో తెలుస్తే షాక్ అవుతారు!

అనగనగ ఓ భర్త…రోజు భార్యను కొట్టేవాడు.ఓ రోజు దెబ్బలకి తట్టుకోలేక డాక్టర్ దెగ్గరికి వెళ్ళింది ఆ భార్య.

 Women Consult Doctor-TeluguStop.com

ఆమెను చూసి నొప్పి తగ్గడానికి మందులు ఇచ్చాడు డాక్టర్.అలాగే మరోసారి ఆమెకు ఈ స్థితి రాకూడదు అని మరొక మందు కూడా ఇచ్చాడు డాక్టర్.

ఆ మందు చాలా బాగా పని చేసింది.ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.? మీరే చూడండి!

నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నోటినిండా నీళ్ళు పెట్టుకుని నీ భర్త పడుకునేదాక అలాగే ఉంచుకోమ్మా! ఖచ్చితంగా నీ భర్తనిన్ను కొట్టడు అని చెప్పేశాడు.దీంతో ఇదేమి నీటి వైద్యమో ఆమెకు అర్థం కాలేదు.

డాక్టర్ కు ఏమయినా తిక్క లేసిందా.నా నోట్లో నీళ్లు పెట్టుకుంటే నా భర్త నన్ను కొట్టకపోవడమేమిటి? విడ్డూరం కాకపోతే అనుకుంది.అయినా సరే అంతే చేస్తానని చెప్పి ఇంటికి వచ్చేసింది.

డాక్టర్ అంటే భాగా చదువుకున్నాయన కదా.ఏదో చెప్పారు, చేస్తే పోయేదేముందని అలాగే చేసింది.యదావిథిగా ఆ రోజు రాత్రి ఇంటికి భర్త తాగి వచ్చాడు.

కాని ఆమె తన భర్తను ఏమీ అనలేదు.ఎందుకంటే డాక్టర్ చెప్పిన వైద్యంలో భాగంగా నోటినిండా నీళ్లు ఉన్నాయిగా! అందుకే తన భర్తకు భోజనం వడ్డించి కామ్ గా ఉండిపోయింది.

తర్వాత తన భర్త పడుకున్నాక నీళ్లు ఊసేసింది.ఆశ్చర్యంగా భర్త తనని కొట్టలేదు.

సంతోషంగా ఒక వారం ఇలాగే గడిచిపోయింది.వారం అయ్యాక డాక్టరుగారిని కలిసి నిజంగానే తన భర్త తనను కొట్టడంలేదని చెప్పింది.

నోటిలో నీటికి తనని కొట్టకుండా ఉండటానికి సంబంధం ఏంటని డాక్టరును అమాయకంగా అడిగింది ఆ మహిళ.

డాక్టరుగారు నవ్వుతూ… ఇలా నోరుమూసుకుంటే ఎలాంటి సమస్యలూ రావు.

అతను ఇంటికి వచ్చాక నీవు నోరుమూయకుండా మాట్లాడుతూ ఉంటే మాటకు మాట సమాధానంగా ఆయన ఎదురు మాట్లాడుతూ ఉంటాడు.ఇలా మాటా మాటా పెరిగి అది చివరికి నువ్వెంత నువ్వెంత అనే వరకు వస్తుంది.

అసలే తాగిన మైకంలో ఉన్నాడు కాబట్టి కొట్టే ప్రమాదం ఉంది.అందుకే ఈ గాయాలు… నువ్వు మౌనంగా ఉండటమే మంచిది కదా అని ఇలా చెప్పానన్నాడు.

ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది.కాబట్టి కాస్త నోటిని అదుపులోఉంచుకోవడం వలన అందరికీ చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube