ఈ జంతువులతో నిపా వైరస్ సోకుతుంది..ఆ జంతువులు ఏంటో చూడండి మందు లేదు..అందరికి తెలియచేయండి

కేరళ తో పాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలను వణికిస్తున్న నిపా వైరస్ గురించి చాలా భయలున్నాయి.అయితే ఈ నిపా వైరస్ గాలి ద్వారా సోకదు.

 Nipah Virus Spread By These Animals-TeluguStop.com

అప్పటికే వైరస్ సోకిన జంతువు లేదా మనిషితో డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా మాత్రమే ఈ వైరస్ వ్యాపిస్తుంది.ఈ వైరస్ నివారణ కు ఇంకా ఏ మందులు లేవు.

అయితే కొన్ని చేయడం ద్వారా నిపా వైరస్ సోకకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తలు

ఇంటెన్సివ్ సపోర్టివ్ కేర్ చికిత్స

అయితే ఈ వైరస్ ను సమర్థంగా చంపగలిగేది ఇంటెన్సివ్ సపోర్టివ్ కేర్ చికిత్స ఒక్కటే.ఈ వైరస్ భారిన పడకుండా ఉండాలంటే వైరస్ ఉన్న ప్రాంతాల్లో పందులు , గబ్బిలాలు లేకుండా చూసుకోవాలి.

నిపా వైరస్ సోకిన వారిని ట్రీట్ చేసినపుడు లేదా కలిసినప్పుడు మాస్క్, గ్లోవ్స్ తొడుక్కోవాలి.

పందులు , గబ్బిలాలకు దూరంగా ఉండాలి

అనారోగ్యంతో ఉన్న పందులు , గబ్బిలాలకు దూరంగా ఉండటం, పక్వానికి రాని ఖార్జుర రసాన్ని తగకుండా ఉండటం ద్వారా ఈ వైరస్ భారిన పడకుండా ఉండవచ్చు.ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం , తలనొప్పి , మత్తుగా కనిపించడం, శ్వాస సరిగ్గా ఆడకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఇలాంటి లక్షణాలు కనిపించిన 24 నుండి 30 గంటల్లో భాదితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

జునొసీస్

ఇక ఈ వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్తగా వెలుగులోకి వచ్చిన ‘జునొసీస్’ అనే జంతువు నుండి మనుషులకు వ్యాపించే వైరస్ గా గుర్తించారు.‘ ఫ్రూట్ బ్యాట్స్’ అనే ఒక రకం గబ్బిలాలు నిపా వైరస్ కు వాహకలు గా పని చేస్తాయని గుర్తించారు.

ముందు జాగ్రత్తే మందు

నిపా వైరస్ నివరణకు మందులు లేవని , ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రత్యేక చికిత్సలో నివారియించవచ్చని వైద్యులు చెపుతున్నారు.ప్రతి ఒక్కళ్ళు చేతులని శరీరాన్ని సుబ్రన్గా ఉంచుకోవాలి.

బయట కొన్న పండ్లు కూరగాయలు శుభ్రం చేసుకుని తినాలి.మామిడి పండ్లు , రోజ్ ఆపిల్స్ , జాక్ ఫ్రూట్స్ లను గబ్బిలాలు ఎక్కువగా ఆహారంగా ఎక్కువగా తీసుకుంటాయట , వీటిని తీసుకున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

నిపా వైరస్ గురించి ఇంకొంత సమాచారం

ఇక ఇండియన్ జర్నల్ ఆఫ్ వైరలాజి విశ్లేషణ ప్రకారం నిపా వైరస్ మనుషులు , పశువులకు గాలి లేదా లాలాజలం ద్వారా సోకె జునోటిక్ దీన్ని భారత్ లో మొదటగా కేరళలో కనుగొన్నారు.అంతే కాకుండా పందులు , గబ్బిలాలు తిని వదిలిపెట్టిన పదార్థాల్లో ఇది సంక్రమిస్తుంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దీన్ని మొదటగా సుంగయ్ నిపా గ్రామంలో 1998 లో తొలిసారిగా గుర్తించారు, తరువాత సింగపూర్ కు వ్యాపించింది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube