ఇంట్లో ఎలుకలు ఉండకుండా చేసే సూపర్ ఉపాయాలు

ఎలుకలు ఇంట్లో ఉండి, ఇటు బియ్యం బాస్తాలని, అటు పిండి బస్తాలని చెల్లాచెదురు చేస్తోంటే ఇల్లాలి కంట్లో కన్నీరు రావడమే తక్కువ.రాజమౌళి సినిమాల్లో హీరో విలన్ ని చితకబాదినట్టుగా ఎలుకలని బాదాలి అని అనిపిస్తుంటుంది పడుచులకి.

 How To Get Rid Of Mice At Your Home Tips1-TeluguStop.com

కాని ఏం లాభం … ఏనుగు దోమని ఏం చేయలేనట్టుగా, మనకన్నా బలహీనమైన ఎలుకలని మనం సొంతంగా ఏమి చేయలేం నిజంగానే.కాని మన ఉపాయాలతో వాటిని సులువుగానే బోల్తా కొట్టించవచ్చు.

మరి ఆ ఉపాయాలేంటో చూడండి.

* మిరియాలు, లవంగాలు బాగా దంచి ఆ పొడిని డోర్ ఓపెనింగ్స్ దగ్గర కాస్త వెదజల్లండి.

లేదంటే ఈ మిశ్రమాన్ని ఆయిల్ లో వేసి కాటన్ బాల్స్ అందులో ముంచి ఎక్కడెక్కడైతే ఎలుకలు దూరే అవకాశం ఉందో, అక్కడక్కడ పెట్టండి.ఈ వాసన ఎలుకల తట్టుకోలేవు

* పెప్పర్ మెంట్ ఆయిల్ అంటే ఎలుకలకి అస్సలు పడదు.

ఆ వాసన వాటికి కంపుగా అనిపిస్తుందో లేక ఆ వాసనని తట్టులోలేవో తెలియదు కాని, మొత్తం మీద పెప్పర్ మెంట్ ఆయిల్ ఎలుకల మీద పనిచేస్తుంది.కాటన్ బాల్స్ ని ఆయిల్ లో ముంచి ఇంట్లో అక్కడక్కడ పెట్టండి.

* యూకెలిప్టస్ మనుషుల శరీరానికి మంచిదేమో కాని ఎలుకల శరీరానికి మంచిది కాదు.ఈ వాసన కూడా ఎలుకలకి పడదు.ఆడ, మగ అంటూ తేడా లేకుండా అన్ని పారిపోతాయి.అయితే ఆకులని ఇంట్లో పెట్టండి లేదంటే యూకెలిప్టస్ ఆయిల్ లో కాటన్ బాల్స్ ముంచి ఇంట్లో పెట్టండి.

* ఇంట్లో రహస్య ద్వారాలు ఉంటే సీల్ చేయండి.లేదంటే చిన్న సైజు నెట్స్ ఫిక్స్ చేయండి.సీల్ చేస్తే రాలేవు, నెట్ వేస్తే చిక్కుకుంటాయి.ఏదైతే ఏం, ఎలుకల బెడద తప్పుతుంది

* చాలా సింపుల్ .పిల్లిని పెంచుకోండి.పిల్లిని చూస్తే, మనుషులు పులిని చూసినట్టుగా భయపడతాయి ఎలుకలు.

ఈ విషయం మీకు తెల్సిందే.ఇంట్లో ఓ చిన్న పిల్లిని పెంచుకోండి.మీకు ఇటు టైమ్ పాస్ అవుతుంది, అటు ఎలుకల ఇబ్బంది తప్పుతుంది

* మార్కేట్లో కిట్టి లిట్టర్, మౌస్ ట్రాప్స్, మౌస్ కాయిల్స్ దొరుకుతాయి.ఈ పనులన్ని చేయడానికి బద్ధకంగా అనిపిస్తే, ఇవి కొనేసి వాడండి

* ఇల్లు శుభ్రంగా ఉండాలి.తిండివస్తువులు గట్టిగా ఉండే పాత్రల్లో దాచాలి.ఆహరం దొరికే అవకాశం కనబడకపోతే ఎలుకలు ఇంట్లోకి రావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube