జ‌య మృతి వెన‌క భారీ కుట్ర

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.జ‌య మృతిచెందిన మ‌రుస‌టి రోజు నుంచే ఆమె మృతిపై స‌వాల‌క్ష సందేహాలు, ఎన్నో అనుమాన‌పు ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 Secret Behind Amma’s Death-TeluguStop.com

అమ్మ‌కు షుగ‌ర్ ఎక్కువ‌వ్వ‌డంతో ఆమెకు రెండు కాళ్లు తీసేశార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌స్తే…ఇప్పుడు ఆమెపై విష‌ప్ర‌యోగం జ‌రిగింద‌న్న మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

ఈ వార్త ప్ర‌కంప‌న‌లు రేప‌డంతో రాష్ట్ర భుత్వం జ‌య మృతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.

జయలలితకు అందించిన చికిత్సపై సమగ్ర నివేదికను కేంద్రప్రభుత్వం కోరాలని స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు.స్టాలిన్ విజ్ఞ‌ప్తులు ఇలా ఉంటే ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, ఎన్డీటీవీ క‌న్స‌ల్టింగ్ ఎడిట‌ర్ బ‌ర్ఖాద‌త్ త‌న స‌హ‌చ‌రుల‌కు, టీవీ యాజ‌మాన్యానికి పంపిన మెయిల్స్‌కు క‌ళ్లుచెదిరే షాకింగ్ నిజాలు వెల్ల‌డైన‌ట్టు తెలుస్తోంది.

సెప్టెంబ‌ర్ 22వ తేదీన అనారోగ్యానికి గురైన జ‌య‌ను ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చేనాటికి ఆమెకు షుగ‌ర్ వ్యాధికి సంబంధించిన మందులు కాకుండా ఆమెకు ఇత‌ర‌త్రా మందులు ఇస్తున్న‌ట్టు ఆ మెయిల్స్‌లో ఉంది.ఈ విష‌యాన్ని త‌న‌కు అపోలో యాజ‌మాన్య‌మే స్వ‌యంగా చెప్పిన‌ట్టు బర్ఖాద‌త్ ఆఫ్ ద రికార్డుగా ఆ మెయిల్‌లో పేర్కొన్నార‌ట‌.

ఇంత కీల‌క‌మైన విష‌యం స‌హ‌జంగా అయితే బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్సే లేదు.అయితే కొంద‌రు హ్యాక‌ర్లు బ‌ర్ఖాద‌త్ మెయిల్‌ను హ్యాక్ చేయ‌డంతో ఈ భ‌యంక‌ర వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

షుగ‌ర్‌తో బాధ‌ప‌డుతోన్న జ‌య‌కు త‌ప్పుడు మందులు ఇవ్వ‌డం వ‌ల్లే ఆమె చ‌నిపోయార‌ని ఆ మెయిల్ సారాంశంగా తెలుస్తోంది.

బ‌ర్ఖాద‌త్ స్టింగ్ ఆప‌రేష‌న్‌లో ఉన్న ఈ నిజాలు లీక్ కావ‌డంతో త‌మిళ‌నాటు పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే అమ్మ మృతిపై ఎన్నో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా…తాజా సంఘ‌ట‌న‌తో విప‌క్షాలు సైతం అమ్మ మృతిపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి.ఈ క్ర‌మంలోనే స్టాలిన్ అమ్మ మృతిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

అమ్మ మ‌ర‌ణంపై ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు అపోలో యాజ‌మాన్యంతో పాటు డాక్ట‌ర్ల‌కు నిజ‌నిర్దార‌ణ ప‌రీక్ష‌లు చేయాల‌ని మ‌ద్రాస్ హైకోర్టులో ఫిల్ దాఖ‌లైంది.మ‌రికొంద‌రు సీబీఐతో విచార‌ణ‌కు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube