అక్కినేని హీరోతో వైఎస్‌.జ‌గ‌న్ అల్ల‌రి

సెల‌బ్రిటీల చిన్న‌నాటి సంగ‌తులు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.ఎన్ని ప‌నులున్నా ప‌క్క‌న పెట్టేసి మ‌రీ టీవీలో అయితే వినేందుకు, పేప‌ర్లో అయితే చ‌దివేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తాం.

 Sumanth Shares Memories With Ys Jagan-TeluguStop.com

ఇక‌, ఆ సెల‌బ్రిటీలు మ‌నోళ్లే అయితే, మ‌నం నిత్యం చూసే వాళ్లే అయితే.అదింకా ఆస‌క్తికరం! అలాంటి ఆస‌క్తిక‌ర విష‌యాన్నే వెల్ల‌డించాడు అక్కినేని హీరో స‌త్యం.

అదేనండి సుమంత్‌! ఈ హీరో చెప్పిన ఆస‌క్తిక‌ర సంఘట‌న కూడా వైకాపా అధినేత జ‌గ‌న్ చిన్న‌నాటి సంగ‌తే!! ఒక సెల‌బ్రిటీ.మ‌రో ప్ర‌జానేత చిన్న‌నాటి సంగ‌తులు తెలుసుకుంటే.

నిజంగానే ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.అవేంటో మీరూ చ‌ద‌వండి.!!

ప్ర‌ముఖ హాస్య న‌టుడు ఆలీ నిర్వ‌హిస్తున్న ఓ టీవీ షోకి ఇటీవ‌ల అక్కినేని సుమంత్ వ‌చ్చారు.ఈ షో మ‌ధ్య‌లో అలీ అడిగిన కొన్ని విష‌యాల‌కు సుమంత్ ఆస‌క్తి క‌ర స‌మాధానం, వివ‌ర‌ణ ఇచ్చారు.

జ‌గ‌న్‌, తాను చిన్న‌నాటి స్నేహితుల‌మ‌ని సుమంత్ చెప్ప‌డంతో అక్క‌డ ఉన్న‌వారంతా ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయారు.ఈ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.ఒకే క్లాస్‌లో, ఒకే బెంచ్‌లో కూర్చుని ఇద్ద‌రూ చదువుకున్నారట.చిన్న వయసులో వారిద్దరూ కలిసి చాలా అల్లరి చేసేవారట.

బయట పొద్దుపోయేవరకు కలిసి తిరిగేవారట.ఓసారి ఆలస్యంగా ఇంటికి వచ్చి దొంగచాటుగా పైకి ఎక్కుతూ అక్కినేని నాగేశ్వరరావుకి దొరికిపోయారట.

‘‘ఓరోజు రాత్రి బాగా ఆలస్యమైపోవడంతో జగన్‌ మా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.మేం ఇద్దరం దొంగచాటుగా నా బెడ్రూంలోకి వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నాం.

కింద నుంచి పైనున్న నా బెడ్రూమ్‌కు వెళ్లడానికి నేను గ్రిల్‌ పట్టుకుని పైకి ఎక్కుతున్నా.జగన్‌ కింద ఉన్నాడు.

ఆ సమయంలోనే మా తాత సడెన్‌గా బయటకు వచ్చారు.నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.

అప్పటివరకు జగన్‌ అంటే ఎవరో మా తాతకు తెలియదు.పై నుంచి గ్రిల్‌ పట్టుకుని వేలాడుతూనే మా తాతాకు జగన్‌ను పరిచయం చేశా.

‘తాతా అతని పేరు జగన్మోహన్‌రెడ్డి.వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి కొడుకు’ అని పరిచయం చేశాన’’ని చిన్నప్పటి సంగతులను సుమంత్‌ గుర్తు చేసుకున్నాడు.

ఈ సంగ‌తులు సుమంత్ చెబుతుంటే మ‌రింత ఆస‌క్తిగా అనిపించింద‌ని ఆలీ చెప్ప‌డం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube