'జగన్ యాత్ర'తో సర్కార్ నిద్రలేచింది?

ఓదార్పు యాత్రకు సీక్వెల్ గా రైతు భరోసా యాత్రను చేపట్టాడు జగన్.అయితే ప్రజల నుంచి స్పందన ఎలా ఉన్నా…వైకాపా మాత్రం ప్రజలు జగన్ కు బ్రహ్మ రధం పడుతున్నారు అంటూ డప్పులు కొట్టుకుంటుంది.

 Ysrcp Pardhasaradhi Comments On Tdp-TeluguStop.com

ఇదే క్రమంలో వైకాపా నేతలు మాట్లాడుతూ.వైఎస్ జగన్ తలపెట్టిన రైతు భరోసా యాత్రను చూసి బెంబేలెత్తిన రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం సొమ్మును ఐదు లక్షలకు పెంచుతూ జీవోను జారీ చేసిందని ఎద్దేవా చేస్తుంది.

ఆ పార్టీ సీనియర్ నేత పార్ధ సారధి మాట్లాడుతూ.గత అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన చేసిన పోరాటం ఫలించిందన్నారు.రైతు భరోసా యాత్రను త్వరలో చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల మరో 3.5 లక్షల రూపాయల నష్టపరిహారం పెంచుతూ జీవో ఇచ్చిందన్నారు.చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలను జిల్లా కలెక్టరే ధృవీకరించాల్సి ఉందన్నారు.రైతుల మేలు కోసమే తమ పార్టీ పోరాడుతుందన్నారు.పోలవరం ప్రాజెక్టును కేంద్రం స్వయంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వస్తే, పట్టిసం వద్ద రాష్ట్రప్రభుత్వం లిఫ్ట్‌పథకాన్ని ఎందుకు చేపడుతున్నట్లని ఆయన నిలదీశారు.దీని వల్ల రాష్ట్రప్రభుత్వంపై భారం పడుతుందన్నారు.

పోలవరం కుడికాల్వ ద్వారా వరద సీజన్‌లో 70 టిఎంసి నీటిని తోడడం వల్ల ప్రయోజనం ఏముందన్నారు.రాష్ట్రప్రభుత్వం తనకు కావాల్సిన వారికి కాంట్రాక్టు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు లిఫ్ట్ పథకాన్ని చేపట్టిందన్నారు.

తమ పార్టీ పోలవరం ప్రాజెక్టును సంపూర్ణంగా ఆహ్వానిస్తుందన్నారు.తమ పార్టీ అధినేత జగన్ పోలవరంకు పలుసార్లు పాదయాత్ర చేశారన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వల్లనే కుడి, ఎడమ కాల్వల నిర్మాణం పూర్తయిందన్నారు.మరి దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలీదు కానీ ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube