జ‌గ‌న్‌-పీకే మ‌ధ్య ' ష‌ర్మిల ' చిచ్చు

నార్త్‌లో ప్ర‌శాంత్ కిషోర్ పేరు చెపితే అప్ర‌తిహిత విజ‌యాల‌కు కేరాఫ్‌.అలాంటి ప్ర‌శాంత్ కిషోర్‌ను ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్.

 Ys Sharmila Kept Between Jagan And Prashanth Kishore-TeluguStop.com

జ‌గ‌న్ 2019లో త‌న గెలుపుకోసం రంగంలోకి దించాడు.ఫ‌స్ట్ టైం నార్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌శాంత్ కిషోర్ జ‌గ‌న్ గెలుపు కోసం ఇప్ప‌టికే త‌న వ్యూహాలు ప్రారంభించేశాడు.

ఈ క్ర‌మంలోనే ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే స‌ర్వే స్టార్ట్ చేసిన పీకే బృందాలు ఓ నివేదిక త‌యారు చేసి జ‌గ‌న్‌కు ఇచ్చేయ‌డం కూడా జ‌రిగింది.

ఈ క్ర‌మంలోనే పీకే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కొంద‌రు ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌ను ప‌క్క‌న పెట్టేయాని చెప్పిన‌ట్టు కూడా స‌మాచారం.

జ‌గ‌న్ అంటేనే సాధార‌ణంగా ఎవ్వ‌రి మాట విన‌ని ఓ మొండి ఘ‌టం అన్న టాక్ ఉంది.అయితే పీకే విష‌యంలో మాత్రం నూటికి నూరు శాతం ఆయ‌న చెప్పిన వ్యూహాల‌నే అమ‌లు చేస్తున్నాడ‌ట‌.

జ‌గ‌న్ పీకే మాట విన‌డం చాలా మందికే న‌మ్మ‌శ‌క్యంగా లేదు.+

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన అన్ని విష‌యాల‌ను దాదాపుగా ఓకే చేస్త‌న్న జ‌గ‌న్ త‌న సోద‌రి ష‌ర్మిల విష‌యంలో మాత్రం చాలా చాలా లైట్ తీస్కొంటున్న‌ట్టు వైసీపీలోని ఇన్న‌ర్ టాక్‌.

జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు ష‌ర్మిల వంద‌ల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేసింది.అయినా అది వైసీపీ గెలుపున‌కు ఎంత మాత్రం యూజ్ అవ్వ‌లేదు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆమె క‌డ‌ప లేదా ఖ‌మ్మం ఎంపీ సీటు ఆశించినా జ‌గ‌న్ మాత్రం ఆమెకు టిక్కెట్ ఇవ్వ‌లేదు.ఎన్నిక‌ల త‌ర్వాత వీరిద్ద‌రి దూరం పెరిగింద‌ని కూడా టాక్ వ‌చ్చింది.

ఇక కొద్ది రోజుల క్రితం జ‌రిగిన వైసీపీ ప్లీనరీలో ప్రత్యక్షమైన షర్మిలకు మళ్లీ ప్రాధాన్యత దక్కినట్టే అని అంతా అనుకున్నారు.

ఈ క్ర‌మంలోనే ష‌ర్మిల‌కు పార్టీలో ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం ప‌రంగా ఆమెకు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని ఈ క్ర‌మంలోనే ఆమెను వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ప్రశాంత్ కిశోర్ చేసిన సూచనను జగన్ అమలు చేయడం లేదని తెలుస్తోంది.

ఈ విషయంలో జగన్ తీరుపై ప్రశాంత్ కిశోర్ అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube