వైసీపీలో ఆ ముగ్గురికి జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో విప‌క్ష వైసీపీలో ముగ్గురు కీల‌క నాయ‌కుల‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశాడ‌న్న టాక్ వైసీపీ రాజ‌కీయాల్లో న‌డుస్తోంది.ఈ ముగ్గురు వైసీపీ వాయిస్ వినిపించ‌డానికి ఆయువు ప‌ట్టులాంటి వాళ్లు.

 Ys Jagan Strong Warning To Three Ycp Leaders-TeluguStop.com

ఈ ముగ్గురిలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కాగా మ‌రొకరు మాజీ ఎమ్మెల్యే.వైసీపీలో గ‌త మూడేళ్ల‌లో ఎక్కువుగా వాయిస్ వినిపించిన వాళ్ల‌లో న‌గ‌రి ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ రోజా, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.

రోజా, చెవిరెడ్డి అసెంబ్లీ బ‌య‌టా లోప‌ల చేసే హంగామాకు అంతే ఉండ‌దు.వీరు ఎన్నో కాంట్ర‌వర్సీల‌కు కేరాఫ్ అయ్యారు.

రోజా అసెంబ్లీలో నానా ర‌చ్చ ర‌చ్చ చేసి చివ‌ర‌కు అసెంబ్లీ నుంచే యేడాది పాటు స‌స్పెన్ష‌న్‌కు గురైన సంగ‌తి తెలిసిందే.అయినా ఆమె త‌న తీరు మార్చుకోలేదు స‌రికదా.

ఆ త‌ర్వాత మ‌రింత కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు చేయ‌డం స్టార్ట్ చేసింది.

ఇక చెవిరెడ్డి రోజాకు తాను త‌క్కువేం కాన‌న్న‌ట్టు టీడీపీతో పాటు చంద్ర‌బాబును టార్గెట్ చేస్తుంటారు.

వీరిద్ద‌రి విమ‌ర్శ‌ల్లో నిర్మాణాత్మ‌క‌త కంటే వ్య‌క్తిగ‌తంగాను, అడ్డ‌దిడ్డమైన వాద‌నే ఎక్కువుగా ఉంటుంది.ఇక కాపు ఉద్య‌మం త‌ర్వాత మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి తీరు కూడా కాంట్ర‌వ‌ర్సీగానే మారింది.

ఇక ఇప్పుడు ప్ర‌శాంత్ జ‌గ‌న్‌కు ఇచ్చిన నివేదిక‌లో సైతం వీరి ముగ్గురు త‌మ దూకుడు త‌గ్గించుకోక‌పోయినా, కాంట్ర‌వ‌ర్సీ డైలాగ్స్‌కు శుభం కార్డు వేయ‌క‌పోయినా పార్టీకే న‌ష్ట‌మ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ వీరి ముగ్గురికి తీవ్ర‌స్థాయిలో వార్నింగ్ ఇచ్చిన‌ట్టు కూడా తెలుస్తోంది.

వైసీపీ వ‌ర్గాల్లోనే ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.భూమ‌న‌కు మ‌రోసారి టిక్కెట్ ఇవ్వ‌కుండా తిరుప‌తిలో మ‌రో వ్య‌క్తి పేరును జ‌గ‌న్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక రోజాను సైతం జ‌గ‌న్ నేను చెప్పిన‌ట్టు వింటావా ? లేదా బ‌య‌ట‌కు వెళ‌తావా ? అని సీరియ‌స్ అవ్వ‌డంతో ఆమె జ‌గ‌న్ ముందే క‌న్నీరు పెట్టుకున్న‌ట్టు స‌మాచారం.ఈ క్ర‌మంలోనే అలిగిన ఆమె విశాఖ మ‌హాధ‌ర్నాకు సైతం డుమ్మా కొట్టేసిన‌ట్టు టాక్‌.

ఇక చెవిరెడ్డికి కూడా జ‌గ‌న్ గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చార‌ట‌.ఇక వీరిపై జ‌గ‌న్‌కు పార్టీ నాయ‌కులు ప‌దే ప‌దే ఫిర్యాదు చేయ‌డంతో పాటు వీరికి ఇన్న‌ర్‌గా ఎర్త్ పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube