ప్ర‌శాంత్ కిషోర్‌కు జ‌గ‌న్ షాక్‌

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇటీవ‌ల చాలా మారారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.ప్ర‌శాంత్ కిషోర్ వైసీపీ ఎన్నిక‌ల స‌ల‌హాదారుగా రావ‌డానికి ముందు, ఆ త‌ర్వాత జ‌గ‌న్ వైఖ‌రిలో చాలా మార్పు వ‌చ్చిందంటూ వైసీపీ వ‌ర్గాల్లోను, ఏపీ రాజ‌కీయాల్లోను ప్ర‌చారం జ‌రుగుతోంది.

 Ys Jagan Shock To Prashanth Kishore-TeluguStop.com

ఇక జ‌గ‌న్ రామ్‌నాథ్ కోవింద్‌కు పాదాభివంద‌నం చేయ‌డంతో ఆయన క్లీన్‌ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడ‌న్న టాక్ కూడా వ‌చ్చింది.

ఇదంతా ప్ర‌శాంత్ కిషోర్ ఎఫెక్టే అని.ఆయ‌న చెప్పిన‌ట్టు జ‌గ‌న్ తూచా త‌ప్ప‌కుండా అన్ని అంశాలు ఫాలో అవుతున్నాడ‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.ప్ర‌శాంత్ చెప్పిన అన్ని విష‌యాలో ఫాలో అవుతోన్న జ‌గ‌న్ ఓ విష‌యంలో మాత్రం ఆయ‌న‌కు షాక్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది.

ప్ర‌శాంత్ 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌తో పాటు 2 ఎంపీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇవ్వ‌వ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌.

పీకే స్ట్రాంగ్‌గా చెప్ప‌డంతో ఈ సిట్టింగుల‌కు టిక్కెట్లు రావ‌ని అంద‌రూ డిసైడ్ అయ్యారు.

అయితే జ‌గ‌న్ పీకే చెప్పిన ఈ ఒక్క అంశం మాత్రం తాను పాటించ‌న‌ని ఆయ‌న‌కు చెప్పేశార‌ట‌.సిట్టింగ్ ఎమ్మెల్యేలు త‌న‌ను న‌మ్ముకుని వ‌చ్చార‌ని, వాళ్ల‌ను ప‌క్క‌న పెట్ట‌లేన‌ని చెప్పార‌ట‌.

అయితే ఇక్క‌డే ఓ ట్విస్టు కూడా ఉంది.వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం ఉంది.

ఈ రెండేళ్ల‌లో వారు ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వ్వ‌డంతో పాటు వాళ్ల అభిమానం పొందాల‌ని, అలా చేస్తేనే టిక్కెట్ ఇస్తానని కూడా చెప్పారట.

గ‌త‌ మూడేళ్లలో వైసీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు.

మిగిలిన వారు పార్టీని, తనను నమ్ముకుని ఉన్నారని …వీరిని మీ మాట‌తో ప‌క్క‌న పెట్ట‌లేన‌ని జ‌గ‌న్ పీకేకు చెప్పార‌ట‌.అందుకే ఫైన‌ల్‌గా వారికి ఓ అవ‌కాశం ఇద్దామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వారు ప్ర‌జ‌ల్లో అభిమానం సంపాదించుకుంటే వారికే టిక్కెట్లు ఇద్దామ‌ని చెప్పార‌ట‌.

ఏదేమైనా ప్ర‌శాంత్ కిషోర్ మాట‌ను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్ సిట్టింగుల‌కు కాస్త జోష్ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube