" నాకే సలహాలు ఇస్తారా? " - పిచ్చ కోపంగా జగన్

వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం తన పార్టీనుంచి అధికార పార్టీలోకి జరుగుతున్న ఫిరాయింపుల మీద చాలా అసహనంతో ఊగిపోతున్నారు.ఇలాంటి నేపథ్యంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలందరితో లోటస్‌పాండ్‌లో సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి ఏకంగా 13 మంది గైర్హాజరు కావడం ఆయనను మరింతగా కోపానికి గురిచేసి ఉండవచ్చు.

 Ys Jagan Furious Over Party People-TeluguStop.com

ఆ కోపాన్ని వచ్చిన వారి మీద ప్రదర్శించడం, పార్టీని బాగు చేసుకోవడానికి తమకు తోచిన సలహాలు ఇచ్చిన వారి మీద కత్తులు దూయడం గా మారితే ఎవరు మాత్రం హర్షిస్తారు? అందుకే జగన్‌లోని అహంకారమే పార్టీకి ప్రమాదకరంగా మారుతోందని ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎమ్మెల్యేలతో భేటీకి 47 మంది హాజరు కాగా, తన ప్రసంగం పూర్తయిన తర్వాత జగన్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కోరినట్లుగా తెలుస్తున్నది.

మీరు ఎమ్మెల్యేలతో తరచూ కలుస్తూ ఉండాలి అని ఒకరు సలహా చెప్పగానే.జగన్‌ అసహనం హద్దు దాటిపోయిందిట.మరో ఎమ్మెల్యే కూడా అదే మాట అనడంతో.‘టైం వచ్చింది కదాని.

నాకే సలహాలు ఇస్తారా’ అంటూ కస్సుమన్న జగన్‌ అర్థంతరంగా లేచి.సమావేశంలోంచి వెళ్లిపోయారుట.

ఆయన తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపట్ల ఇంత అమర్యాదకరంగా ప్రవర్తిస్తే ఎలా అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.జగన్‌ ఇదివరకటిలాగే ఇంకా అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటే పార్టీ మరింతగా పతనం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube