చేతులు దులుపుకోవడం అంటే నామమాత్రంగా పనిచేయడం అని అర్థం.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పనే చేసారు.
ఏం చేసారు? అయ్యా ప్రధాన మంత్రి గారు మీరు హామీ ఇచ్చిన ప్రకారం మా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరుతున్నాము.విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని అభార్తిస్తున్నాము ఆని బాబు అసెంబ్లీలో తీర్మానం చేయించారు.
అసెంబ్లీ తీర్మానానికి కేంద్రం ఎంతవరకు విలువ ఇస్తుందో తెలియదు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేసిన తీర్మానమే ఆనాడు కేంద్రం ఖాతరు చేయలేదు.
దీన్ని పట్టించుకుంటుందని నమ్మకం ఏమిటి? స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని కేంద్రం ఎప్పుడో నిర్ణయించుకుంది.కాబట్టి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని చెప్పవచ్చు.
ఇక అసెంబ్లీలో జగన్ ఈరోజు చంద్ర బాబుకు సవాల్ విసిరారు.దమ్ముంటే కేంద్రంలోని టీడీపీ మంత్రులను వెనక్కి రప్పించాలని అన్నారు.
మంత్రులతో రాజీనామా చేయించి నిరసన తెలియచేయాలని అన్నారు.ఇలా అనడం ఇది మొదటిసారి కాదు.
కాని ఆ పని బాబు చేయలేరని జగన్కు కూడా తెలుసు.స్పెషల్ స్టేటస్ రాదు.
మంత్రులు రాజీనామా చేయరు.ఇది బాబును బద్నాం చేయడానికి జగన్కు బాగా ఉపయోగ పడుతుంది.