బీజేపీకి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌..!

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ గెల‌వ‌క‌పోతే నెక్ట్స్ ఆయ‌న ఫ్యూచ‌ర్ ఏంట‌న్న‌ది ఆలోచిస్తేనే జ‌గ‌న్‌కు చాలా టెన్ష‌న్‌.

 Ys Jagan Bumper Offer To Bjp-TeluguStop.com

టెన్ష‌న్‌గా ఉంటుంది.ఓ ప్రాంతీయ పార్టీగా ఆవిర్భ‌వించి ఒక్క‌సారి కూడా అధికారంలో లేకుండా పదేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాలంటే ఏ పార్టీకి అయినా క‌ష్ట‌మే.

జ‌గ‌న్ మూడేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉంట‌నే త‌న పార్టీని కాపాడుకోలేక‌పోయాడు.అలాంటిది ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిపక్షంలో ఉండాల్సి వ‌స్తే పార్టీని ఎంత వ‌ర‌కు న‌డ‌ప‌గ‌ల‌డు ? అన్న‌ది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే.ఈ మూడేళ్ల‌లోనే త‌న పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరిపోయారు.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు జ‌గ‌న్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు.

ఓ వైపు జ‌గ‌న్ క‌మ్యూనిస్టుల‌తో జ‌ట్టుక‌ట్టేందుకు లైట్‌గా గ్రీన్‌సిగ్న‌ల్స్ ఇస్తూనే ఉన్నారు.కేంద్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ముంద‌స్తు అంచ‌నాల‌తో జ‌గ‌న్ ఆ పార్టీతో అయినా క‌లిసేందుకు గేట్లు ఎత్తిన‌ట్టే తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

ఇక జ‌గ‌న్‌కు స‌రిప‌డ‌న‌న్ని కేసులూ ఎలాగూ ఉన్నాయి.ఇటీవ‌ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని క‌లిసిన జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ – వైసీపీ పొత్తు కుదిరేలా బీజేపీకి టెంప్టింగ్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు ఢిల్లీలో ఇంట‌ర్న‌ల్‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఇటీవ‌ల ఏపీ, తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సైతం జ‌గ‌న్ ఇచ్చిన ఆఫ‌ర్‌పై ఇక్క‌డ బీజేపీ నాయ‌కుల‌తో చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

ఏపీలో ఉన్న మొత్తం 25 ఎంపీ సీట్ల‌లో 15 వ‌ర‌కు బీజేపీకి జ‌గ‌న్ ఇస్తాన‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

అవ‌స‌ర‌మైతే టీడీపీ నుంచి బీజేపీని దూరం చేసేలా మొత్తం 175 ఎమ్మెల్యే సీట్ల‌లో 40-50 వ‌ర‌కు కూడా ఇస్తాన‌ని జ‌గ‌న్ అన్న‌ట్టు అమిత్ ఏపీ నేత‌ల‌కు చెప్పార‌ట‌.మ‌రో వైపు ఏపీ బీజేపీలో ప‌లువురు సీనియ‌ర్లు టీడీపీతో పొత్తు వ‌ద్ద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో అటు జ‌గ‌న్ నుంచి బీజేపీకి అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చింది.ఈ లెక్క‌ల‌న్ని చూస్తుంటే 2019 ఎన్నిక‌ల నాటికి ఏపీలో బీజేపీ ఎవ‌రితో జ‌ట్టు క‌డుతుందో ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌గానే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube