పవన్ స్పీడుకి బ్రేకులు వేస్తున్న జగన్

జగన్ జోరు తగ్గుతోంది.నంద్యాల,కాకినాడ ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ హవా ఎక్కడా కనపడటం లేదు అంటూ వస్తున్నా వార్తలకి.

 Ys Jagan Breaks Pawan Kalyan Speed-TeluguStop.com

జగన్ చాలా ఘాటుగానే సమాదానం ఇవ్వబోతున్నారు.దీనికోసం ప్రత్యేకంగా వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు అనే భావన.తెలుగుదేశం ఈ హోదా విషయంలో రాజీ పడింది అనే ఆగ్రహం ప్రజలలో బలంగా ఉంది.

ఇప్పుడు ఇదే అస్త్రంగా దూసుకుపోనున్నారు జగన్మోహన్ రెడ్డి.నవంబర్ 2వ తేదీ నుంచి ఆరు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేయనున్నారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఈ పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుంది

పాదయాత్ర ప్రారంభానికి ముందే ప్రతీ నియోజకవర్గంలో యువభేరిలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.అంతేకాదు తన పాదయాత్ర చేయబోయే నియోజక వర్గంలో తానూ వెళ్ళే సరికే ప్రతేక్యహోదా ఉద్యమం ప్రజలలో చొచ్చుకుని పోయేలా కార్యక్రమాలు చేయాలని చెప్పారు.

అందుకోసమే జగన్ అన్ని నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలోనే వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ విషయంలో జగన్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న రీతిలో తన పాదయాత్రతో ఒకేసారి.

పవన్ కళ్యాణ్ .చంద్రబాబు నాయుడు ఇద్దరికీ చెక్ పెట్టనున్నారు.

పవన్ కళ్యాణ్ సిని హీరోగా జనాలకి అభిమానం ఉండవచ్చు కానీ.ఒక రాజకీయ నాయకుడిగా తానూ చేసే పనులు ప్రజలలో విసుగు తెప్పిస్తున్నాయి.ఒకప్పుడు ప్రత్యేక హోదానే ధ్యేయంగా పోరాడుతాను అన్న పవన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.చంద్రబాబు.

పవన్ ఒకరినొకరు చెప్పుకుని చేస్తున్నట్టుగా ఉంటున్నాయి పవన్ లేవనెత్తే సమస్యలు.ఈ మధ్యకాలంలో పవన్ చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా జనసేన అధినేతగా కంటే కూడా తెలుగుదేశం తరపు ప్రతినిధిగానే కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారు.

ఈ సమయంలోనే పవన్ ప్రత్యేక ఆంధ్రా విషయంలో వెనక్కి తగ్గారు.అప్పుడపుడు ప్రత్యేక ఆంధ్రా అని అంటున్నా…అవి మాటలకే పరిమితం అయ్యాయి

జగన్ ప్రత్యేహోదా తో గళం ఎత్తుతున్నారు.

ఈ విషయంలో జగన్ ఫుల్ క్లారిటీ తో ఉన్నట్టుగా తెలుస్తోంది.అయితే అందుకు జగన్ కూడా వివరణ ఇచ్చారు.

ప్రత్యేక హోదాపై ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో యువభేరిలను నిర్వహించామని సెలవులు రావడంతోనే యువభేరిలు జరపలేకపోయామన్నారు.అంతేకాకుండా హోదాపై ఆఖరి అస్త్రంగా ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని కూడా ప్రకటించడం విశేషం.

అయితే.పవన్ కంటే తామే ప్రత్యేకహోదాకు పాటుపడుతున్నానన్న సంకేతాలు ఇవ్వాలన్నది జగన్ ఉద్దేశంగా కన్పిస్తోంది.

జగన్ కనుకా ఈ విషయంలో సక్సెస్ అయితే పవన్ పని అంతే అనే వార్తలు వినిపిస్తునాయి.జగన్ ఈ పాదయత్రలోనే.

చంద్రబాబు.అభివృద్ధి పేరుతో ప్రజలని ఎలా మోసం చేస్తున్నాడో.

రైతులని ఎలా నట్టేట ముంచుతున్నారో వివరిస్తూ అదే సమయంలో పవన్.చంద్రబాబుల లాలుచీని ప్రజలకి అర్థం అయ్యేలా చెప్పనున్నారు.

ఈ విషయంలో ఇప్పటికే అనేకరకాల వర్కౌట్స్ చేసినట్టుగా తెలుస్తోంది.పవన్ కూడా కొద్ది రోజుల్లో రాధా యాత్ర చేపట్టనున్నారు.

మరి ఎవరు ప్రజల ముందు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube