సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు

క్విడ్‌-ప్రో-కో (నీకింత…నాకింత) ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు.జగన్‌కు చెందిన కంపెనీల్లో క్విడ్‌-ప్రో-కో విధానంలో పెట్టుబడులు వచ్చాయనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

 Ys Jagan Appears Before Cbi Court-TeluguStop.com

ఈరోజు ఈ కేసులో జగన్‌, దాంతో సంబంధమున్న వ్యక్తులు కోర్టుకు హాజరైన తరువాత కేసు విచారణ ఈ నెల ఇరవైనాలుగో తేదీకి వాయిదా పడింది.ఈ కేసులో జగన్‌ ప్రధాన నిందితుడు.

సహ నిందితుల్లో జగన్‌ ఆర్థిక సలహాదారు వి విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఉన్నారు.వీరిద్దరు కూడా కోర్టుకు హాజరయ్యారు.

ఈ కేసు కథాకమామీషు ఏమిటో అందరికీ తెలుసు.దీన్నే అక్రమాస్తుల కేసు అని కూడా అంటున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్ష విధించినప్పుడు ఏపీలో జగన్‌ వ్యతిరేకులంతా ముఖ్యంగా టీడీపీ నాయకులు యమ సంతోషించారు.జయలలితకు శిక్ష పడినందుకుకాదు.

జగన్‌ కూడా అక్రమాస్తుల కేసులో నిందితుడు కాబట్టి ఆయనకూ శిక్ష పడుతుందన్నారు.జయను కర్నాటక హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసినప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్‌ను దోషిగా నిర్ధారిస్తే ఆయన పై కోర్టుకు వెళ్లడం ఖాయం.ఈ కేసు ఎన్నేళ్లు నడుస్తుందో చెప్పలేం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube