నిఖిల్ ను 'కేశవ' చేసిన సుధీర్..!

స్వామిరారా సినిమాతో నిఖిల్ కు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన దర్శకుడు సుధీర్ వర్మ మళ్లీ యువ హీరో నిఖిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ గా కేశవ అని పెట్టారు.మూస కథలతో తన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్న నిఖిల్ కు ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ ఇచ్చిన సుధీర్ వర్మ ఇప్పుడు కేశవగా నిఖిక్ ను ప్రెజెంట్ చేస్తున్నాడు.

 Young Hero Nikhil New Title Keshava-TeluguStop.com

స్వామిరారా తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ సినిమా తీసినా అది అంతగా ఆడలేదు.

అందుకే కాస్త గ్యాప్ తీసుకుని నిఖిల్ తో సినిమా చేస్తున్నాడు సుధీర్ వర్మ.

ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తుండటం విశేషం.రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుదట.

సినిమాలో క్యారక్టర్ పేరు కేశవ అందుకే ఎక్కువ రిస్క్ లేకుండా అదే టైటిల్ గా ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.అతి తక్కువ కాలంలోనే బడా డిస్ట్రిబ్యూటర్ గా అవతరించిన అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

ఈ కేశవ స్వామిరారా మ్యాజిక్ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube