ఇంటర్నెట్ లో అలా చేస్తే జైలు శిక్ష తప్పదు

ఏళ్ళుగా టొరెంట్ సైట్లకి టొరెంట్ ఫైల్స్ కి బాగా అలవాటు పడిపోయారు జనాలు.ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి అవసరాన్ని పైరసి రూపంలో తీర్చిన ఈ సైట్లపై వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు తమ బలాన్ని ప్రదర్శించి బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.

 You Could Be Jailed On Visiting Government Blocked Websites In India-TeluguStop.com

కొన్ని మూతపడితే, మరికొన్ని ఎవరు చూడలేకుండా బ్లాక్ అయిపోయాయి.మన భారత ప్రభుత్వం కూడా వందలకొద్దీ పైరసి సైట్లను బ్లాక్ లిస్టులో పెట్టేసింది.

అయితే, కొన్ని ట్రిక్స్ ద్వారా గవర్నమెంటు బ్లాక్ చేసిన సైట్లను కూడా జనాలు దర్శించి, వాటినుంచి కావాల్సిన కంటెంట్ ని డవున్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదంట.

గవర్నమెంటు బ్లాక్ చేసిన వెబ్ సైట్లని అతితెలివితో దర్శించినా, వాటిలోంచి ఏదైనా డవున్లోడ్ చేసినా, కాపిరైట్ ఆక్ట్ సెక్షన్ 63, 63/A, 65 మరియు 65/A కింద మూడేళ్ళ జైలుశిక్షతో పాటు మూడులక్షల జరిమానా పడుతుందని, అందుకే థర్డ్ పార్టీ డిఎన్ఎస్ ఉపయోగించి, గవర్నమెంటు బ్లాక్ ని బైపాస్ చేయొద్దని ప్రభుత్వ ప్రతినిధులు ప్రకటించారు.

అయితే ఈ ప్రకటనపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్ లిస్టులో ఉన్న వెబ్ సైట్లు అందరికి ఎలా గుర్తుంటాయని, ఒక్కోసారి హ్యాక్ గురై ఆయా వెబ్ సైట్లలోకి వినియోగదారులు తెలియకుండా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటని, కేవలం వెబ్ సైట్లని విసిట్ చేసినందుకే జైలు శిక్ష టూమచ్ అని వాపోతున్నారు ఇంటర్నెట్ వినియోగదారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube