జ్ఞాపకశక్తి పెంచుకోండిలా

పర్స్ ఎక్కడో పెడతాం, మరచిపోతాం.బైక్ తాళంచెవి ఎక్కడో పెడతాం, మర్చిపోతాం.

 Yoga Improves Memory Power Better Than Brain Exercises-TeluguStop.com

గ్యాస్ తెచ్చి ఎన్నిరోజులైంది, ఇంత త్వరగా అయిపోయింది అంటే తల నేలకేసి బాదుకున్నా గుర్తురాదు.ప్రతి ఇంట్లో జరిగే విషయాలే ఇవి.చిన్న చిన్న విషయాలే, కాని గుర్తుండవు.మనందరిలో స్మాల్ సైజ్ గజిని ఉంటాడు.

అయితే అందరు ఇలానే ఉండరనుకోండి.కొందరి జ్ఞాపకశక్తి నమ్మడానికి వీలు లేకుండా ఉంటుంది.

సహజంగానే అలా ఉంటారు కొందరు.మరి మన జ్ఞాపకశక్తి పెరిగేదెలా?

జ్ఞాపకశక్తి పెంచుకోచడానికి యోగాను మించిన సాధనం లేదంటున్నారు అమెరికా పరిశోధకులు.25-55 సంవత్సరాల మధ్యలో ఉన్న తమ క్లయింట్స్ ని రెండు గుంపులుగా విభజించారు ఒక మెడికల్ గైడ్ సెంటర్ నిర్వాహకులు.మూడు నెలలపాటు ఒక గుంపుని బ్రేయిన్ వ్యాయామాలు, వాటికి సంబంధించిన మందులు వాడమని చెప్పారు.

ఇక రెండో గుంపుని యోగా చేయమని, అందులోనూ కుండలిని యోగా, కీర్తన్ క్రియ చేయమని సూచించారు.

మూడు నెలల తరువాత రెండు గుంపులను పరీక్షించారు.ముఖాన్ని గుర్తుపెట్టుకోవడం, పేర్లు, వస్తువులని ఎక్కడ దాచారో గుర్తుపెట్టుకోవడం .ఇలా అన్ని రకాలుగా ప్రశ్నించగా, రెండు గుంపుల్లో మంచి ఫలితాలు కనిపించినా, యోగా చేసిన గుంపే విజయం సాధించిందట.

ఇంకేం .మీరు కూడా ఈ ఆర్టికల్ ని మర్చిపోకుండా యోగా చేయడం మొదలుపెట్టండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube