అడ్డంగా బుక్ అయిన 'ఎం.ఎల్.ఏ' కూతురు

అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేసేయ్యవచ్చు, మనల్ని ఎవడు ఏం చేస్తాడు అన్న గర్వమో, లేక ప్రజాప్రతినిధుల కుటుంబాలను పోలీసులు టచ్ చెయ్యలేరు అన్న భరోసానో తెలీదు కానీ, సాక్షాత్తూ వైకాపా పార్టీ ఎం.ఎల్.

 Ap Ysrcp Mla Kalpana Daughter Keerthi Arrested-TeluguStop.com

ఏ కూతురు ఒకరు అడ్డంగా బుక్ అయ్యిపోయారు.విషయం ఏమిటంటే కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కుమార్తె.

శనివారం రాత్రి తన తల్లి పరువు నడిరోడ్డుపై రోడ్డుపాలు చేసేసింది.వైకాపా ఎమ్మెల్యే కల్పన కూతురు కీర్తి సమత హైదరాబాద్ లో మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడింది.

హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు ఆమె అడ్డంగా దొరికిపోయింది.పోలీసులను చూసి భయపడిపోయిన సమత, కారు వెనక్కి తిప్పి పారిపోయే ప్రయత్నం కూడా చేసింది.

రాంగ్ రూట్లో వెనక్కివెళ్తున్న కారును గమనించిన పోలీసులు దాన్నిఆపారు.మద్యం తాగి కారు నడపడమే కాకుండా, పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు, తాను ఎమ్మెల్యే కూతురునంటూ బెదిరించేప్రయత్నం చేసింది.

ఆవేమీ పట్టించుకోని పోలీసులు ఆమె శ్వాస తనిఖీ చేశారు.అందులో 105 మిల్లీగ్రాముల మద్యం ఉందని తేలింది.

పోలీసులు కీర్తి సమతపై కేసు నమోదు చేశారు.ఇలా అయితే ఎలా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు పాటించాలి కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube