మన టాప్ హీరోలు .. వారి అతిచెత్త సినిమాలు

మన స్టార్ హీరోలు భారి బ్లాక్ బస్టర్స్ కొట్టి ఈ స్టార్ స్టేటస్ ని, అభిమాన గణాన్ని పొందారు.కాని ఎవరి కెరీర్లోనూ అన్ని మంచి సినిమాలే ఉండవు కదా.

 Worst Films Of Tollywood Top 10 Actors-TeluguStop.com

కొన్ని చెత్త సినిమాలు ఉంటాయి.ఎంత పెద్ద అభిమాని అయినా సరే, కూర్చొని ఓ అరగంట చూడ్డానికి కూడా ఇబ్బందిపడే సినిమాలు ఉంటాయి.

మన టాప్ 10 హీరోల కెరీర్లో అత్యంత చెత్త సినిమా సెలెక్ట్ చేసాం.ఈ లిస్టుతో మీరు అంగీకరిస్తే ఒకే, లేదంటే మీ అభిప్రాయం ప్రకారం వేరే సినిమా పేరు చెప్పండి.

1) చిరంజీవి :

చాలామంది చిరంజీవి విరాభిమానుల అభిప్రాయాలని బట్టి చూస్తే, 1995 లో వచ్చిన బిగ్ బాస్ మన మెగాస్టార్ కెరీర్ లో అత్యంత చెత్త సినిమా.ఈ సినిమాకి దర్శకుడు విజయ్ బాపినీడు.ఓపెనింగ్స్ వచ్చినా, సినిమా పోయింది.

2) బాలకృష్ణ :

బాలయ్య బాబు వరస్ట్ సినిమాల లిస్టు చాలా పెద్దది.అభిమానులకి నచ్చని సినిమాలు చాలానే చేసారు.విజయేంద్రవర్మ, ఒక్క మగాడు మరియు పరమవీరచక్ర.ఈ మూడింటికి కలిపి ప్రథమ స్థానం కట్టబెడుతున్నాం.

3) నాగార్జున :

పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.వీరభద్రం చౌదరి దర్శకత్వంలో 2013వ సంవత్సరంలో వచ్చిన భాయ్ నాగార్జున కెరీర్ లో అతిభయంకరమైన చిత్రం.ఈ సినిమా వల్లే నాగార్జున పూర్తిగా మారిపోయారు.

4) వెంకటేష్ :

మళ్ళి ఆలోచించాల్సిన అవసరం లేదు.అదే 2013లో మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన షాడో అతిచెత్త సినిమా.

5) పవన్ కళ్యాణ్ :

పులి, సర్దార్ గబ్బర్ సింగ్ .ఈ రెండిట్లో విజేత ఈ సినిమానో తేల్చడం కొంచెం కష్టమే.కాని పులికి ఈ అవార్డు దక్కాల్సిందే.

6) మహేష్ బాబు :

అయితే క్లాసిక్ ఇస్తాడు లేదంటే డిజాస్టర్.మహేష్ బాబు రూటే వేరు.ఇక అత్యంత చెత్త చిత్రం ఏది అంటే ఎలాంటి అనుమానం లేకుండా బ్రహ్మోత్సవం అని చెప్పాలి.ఈ సినిమా అభిమానులకి కూడా ఓ పీడకల.

7) ఎన్టీఆర్ :

ఒకప్పుడు ఒకే మూసలో కొట్టుకుపోయి కళాఖండాలు తీసాడు తారక్.ఆ నాలుగైదు కళాఖండాలలో టాప్ పొజిషన్ నరసింహుడుకి ఇస్తున్నాం.

8) ప్రభాస్ :

బాహుబలి ప్రభాస్ ఒకప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ లో చాలా వీక్.బి గోపాల్ లాంటి టాప్ డైరెక్టర్ తో అడవి రాముడు అనే డిజాస్టర్ తీసాడు.ప్రభాస్ కెరీర్ లో అతిబలహీనమైన సినిమా ఇది.

9) అల్లు అర్జున్ :

నిజానికి అల్లు అర్జున్ స్క్రిప్టు సెలెక్షన్ అదిరిపోయేలా ఉన్నా, వరుడు అతని కెరీర్ లో ఓ మాయని మచ్చ.ఒక్కడు లాంటి క్లాసిక్ ఇచ్చిన గుణశేఖర్ ఈ సినిమాని చాలా దారుణంగా తీసారు.

10) రామ్ చరణ్ :

చరణ్ కెరీర్ లో సక్సెస్ రేటు ఎక్కువ.ఫామ్ లో ఉన్న టైంలో బాలివుడ్ ఉచ్చులో పడిన తుఫాన్ లాంటి చెత్త సినిమా తీసాడు.

ఈ జనరేషన్ నటుల్లో, ఇంత పెద్ద డిజాస్టర్ ఎవరికీ లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube