‘టెంపర్‌’ తగ్గలేదు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ మూవీ వచ్చి రెండు వారాలు అవుతున్నా కూడా ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్స్‌ వస్తున్నాయి.ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూపిన ఈ సినిమాను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ తెరకెక్కించిన విషయం తెల్సిందే.

 World Cup May Not Effect Temper Movie Collections-TeluguStop.com

విడుదలైన మొదటి రోజు నుండే మంచి టాక్‌ రావడంతో భారీ కలెక్షన్స్‌ను రాబడుతోంది.ఇక ఓపెనింగ్స్‌లో టాప్‌ 5 స్థానంలో నిలిచిన ఈ సినిమా లాంగ్‌ రన్‌లో కూడా ఇతర సినిమాల పోటీ లేకపోవడంతో భారీ కలెక్షన్స్‌ దిశగా దూసుకు పోతుంది.

క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఉన్నప్పటికి ఈ సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయి.విడుదలైన పది రోజుల్లో ఈ సినిమా 40 కోట్ల మార్క్‌ను దాటింది.

ఇక ఈ సినిమా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న 50 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్దంగా ఉంది.రెండవ వారం కూడా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమాకు మూడవ వారం కూడా పెద్ద సినిమాల పోటీ లేదు.

దాంతో ఈ సినిమా మూడవ వారంలో కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.మొత్తంగా ఈ సినిమా 60 కోట్ల మార్క్‌ను చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని ట్రేడ్‌ పండితులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube