Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

స్త్రీలు సిగ్గు వదిలేయాలి అంటున్న బాలివుడ్ హీరోయిన్ -Women Should Be Shameless – Says Bollywood Heroine

బాలివుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ఈమధ్య సినిమాలతో కన్నా, తను బయట మాట్లాడే మాటలతో ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. మంచి టాలెంటేడ్ నటి ఆయన స్వర ఆ మధ్య అనార్కలి ఫ్రం ఆర్హ అంటూ ఓ బోల్డ్ అడల్ట్ సినిమా చేసిన సంగతి మీకు తెలిసిందే. ఇందులో రెచ్చిపోయిన స్వర అర్థనగ్న సన్నివేశాలు, ఒకటి రెండు శృంగార సన్నివేశాలు చేసింది. సినిమా ఆడలేదు కాని పెద్ద పేరు వచ్చింది. లీక్ అయిన సన్నివేశాలతో స్వర పేరు ఇంటర్నెట్ లో తిరిగింది.

ఆమధ్య ఎవరో అబ్బాయి తనని ఓ ట్రెయిన్ లో చూసి, తన ముందే హస్తప్రయోగం చేసుకున్నాడని, మహిళలకు, ముఖ్యంగా సినిమావాళ్ళకి ఎక్కడ సురక్ష లేదని కామెంట్ చేసింది ఈ హీరోయినే. ఆ తరువాత తాప్సితో ఓ వివాదాస్పదమైన విడియో చేసింది ఈ హీరోయిన్. అందులో స్త్రీలు తమ వక్షోజాలను గర్వంగా చూపించాలని, దేవుడు వక్షోజాలను దాచుకోవడానికి ఇవ్వలేదని, ఎలా తోస్తే అలా చూపించాలని, హీరోయిన్లు ఈ మధ్య ఫంక్షన్స్ లో వేస్తున్న డ్రెస్సులని సపోర్ట్ చేసింది. స్కిన్ షో చేయడం తన ఇష్టం అంటూ మాట్లాడే స్వర, తన మాటలకు ఫెమినిజం పూత పూయడం చాలామందికి నచ్చని విషయం. అయినాసరే తనకి తోచిందే మాట్లాడేస్తుంది. తాజాగా ఆడవాళ్ళు సిగ్గు వదిలేయాలి అంటూ కొత్త సలహాతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.

మహిళలు తమ మంచి కోసమే భయంతో పాటు సిగ్గు కూడా వదిలేయాలి, గంభీరంగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి, అరవాలి, సిగ్గుని పక్కనపెట్టాలి, అప్పుడే పైకోస్తారు అంటోంది. తెల్లగా, ఎదో దేవకన్యలా కనిపించాల్సిన అవసరం లేదు,, సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రలు తగ్గడం సంతోషకరం అంటోంది. అంతా ఒకే కాని ఇక్కడ సిగ్గు వదిలేయాలి అనే మాట మళ్ళీ వివాదాస్పదమైంది. స్వర దాన్ని ఏ అర్థంతో చెప్పిందో, దాన్ని ఏ అర్థంలో అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదని వాపోతునన్నారు నెటిజన్లు.

Continue Reading
More Posts
To Top