అమ్మాయలకు అప్పటినుంచే శృంగారం మీద ఆసక్తి తగ్గిపోతుందట

శృంగారం మీద అనాసక్తి అనేది చిన్న విషయం కాదు‌.ఎందుకంటే మనిషి శరీరానికి దొరకాల్సిన అత్యవసర అనుభవాల్లో శృంగారం అనేది ప్రధానమైనది‌.

 Women Reveal When They Start Losing Interest In Ex-TeluguStop.com

ఆ అనుభవం తగ్గాలని, ఆ అనుభూతిని పొందడాన్ని మానేయ్యాలని ఎవరు కోరుకోరు‌‌.సరైన అనుభవం దొరక్క అనాసక్తి పుడుతుంది అంతే.

మరి అనాసక్తి స్త్రీ, పురుషులలో ఎవరికి ముందు పుడుతుంది? ఎప్పుడు పుడుతుంది? ఎలా పుడుతుంది? ఈ విషయం మీద కాస్మాపాలిటన్ ఓ సర్వే చేపట్టింది.ఫలితాలు ఇలా ఉన్నాయి.

సర్వేలో 5000 మంది స్త్రీలు 3000 మంది పురుషులు పాల్గొన్నారు.ఇందులో 47 శాతం మంది స్త్రీలు పెళ్లి జరిగిన ఒక సంవత్సరానికి శృంగారం మీద అనాసక్తికరంగా అనిపించడం మొదలవుతుందని చెప్పుకొచ్చారు.23 శాతం మంది రెండు సంవత్సరాలకు అనాసక్తి పడుతుందని చెప్పారు.21 శాతం మంది ఐదారేళ్ల సమయంలో శృంగారం మీద ఆసక్తి తగ్గుతుందని చెప్పారు కేవలం 9 శాతం మంది తమకు ఇప్పటి వరకు కూడా శృంగారం మీద అనాసక్తి కలగలేదని చెప్పారు.సర్వేలో పాల్గొన్న స్త్రీలంతా కూడా 30 ఏళ్లకు పైగా వయస్సు నిండిన వారే కావడం గమనార్హం.అంటే అందరికీ కూడా శృంగారం అనుభవం దొరికింది అన్నమాట.

సర్వే ఫలితాల మీద ప్రముఖ సెక్సాలజిస్ట్ డానియల్ స్పందిస్తూ “నాకు తెలిసినంత వరకు దీనికి ప్రధాన కారణం పని ఒత్తిడి అనుకుంటున్నాను.స్త్రీలు మగవారి కంటే ఎక్కువ పని ఒత్తిడి తీసుకుంటారు.

పురుషులు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తరువాత రోజంతా పడిన కష్టాన్ని కవర్ చేసుకోవడానికి విశ్రాంతి దొరుకుతుంది.కానీ స్త్రీలకు నిత్యం పనే.ఆ పని ఒత్తిడి శృంగార హార్మోన్లపై చెడు ప్రభావం చూపి లిబిడో ని తగ్గిస్తుంది.అందుకే శృంగారంపై అనాసక్తి మొదలవుతుంది.

కానీ అదొక్కటే కారణంగా చెప్పలేము.స్త్రీలకు భావప్రాప్తి దొరికేది చాలా తక్కువ.

భావప్రాప్తి కలగనప్పుడు ఏ మనిషికి మాత్రం శృంగారం మీద ఆసక్తిగా ఉంటుంది? పిల్లల్ని కనడం కూడా ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని.ఆ కారణంగా కూడా మెళ్లి మెళ్లిగా శృంగారం మీద ఆసక్తి తగ్గడం మొదలవుతుంది.కానీ 47 శాతం మంది పెళ్లి జరిగిన మొదటి సంవత్సరం దరిదాపుల్లోనే శృంగారం మీద అనాసక్తి మొదలవుతుందని అంటున్నారు అంటే ఇది కచ్చితంగా భర్తల తప్పే.పడకగదిలో మగవారు అంచనాలను అందుకోలేకపోతుంటే ఇలానే జరుగుతుంది” అని అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube